ఏ రాజకీయ పార్టీ అయినా, తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పుకోగలగాలి. అధికారంలో వున్నా, లేకపోయినా ప్రజలకు అండగా నిలబడటం రాజకీయ పార్టీల, రాజకీయ నాయకుల బాధ్యత. కానీ, రాజకీయం అంటేనే అధికారం.. ఆ అధికారం కోసం ఏ అడ్డదారైనా తొక్కవచ్చన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ అనే ‘వ్యూహకర్త’ (Prashant Kishor The Political Stratogist Says Good Bye) రాజకీయ పార్టీలకు వరంగా మారారు.
ఏ రాజకీయ పార్టీకి ఆయన వ్యూహకర్తగా పనిచేసినా, ఆ రాజకీయ పార్టీకి విలువైన సలహాలు, సూచనలు అందిస్తుంటారు. ‘ఐప్యాక్’ (IPAC Prashant Kishore) అనే టీమ్ ద్వారా ఈ వ్యవహారాలు చక్కబెడుతుంటారు. గ్రామ స్థాయిలోకి, బూత్ స్థాయిలోకి వెళ్ళి మరీ, అక్కడి ప్రజల నాడి గురించి తెలుసుకుంటారు. ప్రజల సెంటిమెంట్లను అర్థం చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఆయా పార్టీలకు లోపాలున్నాయో తెలియజేస్తారు.
ఏం చేస్తే, ఓటర్లను ఆకట్టుకోవచ్చు? ఏం చేస్తే, ప్రజల్ని రెచ్చగొట్టొచ్చు? వంటి అంశాలపైనే ఐ ప్యాక్ టీమ్ ఫోకస్ పెడుతుందన్న విమర్శలు లేకపోలేదు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Ys Jaganmohan Reddy) మీద జరిగిన కోడి కత్తి దాడి, ఇటీవల మమతా బెనర్జీ (Mamata Benerjee)మీద జరిగిన దాడి.. రెండిటినీ ఒకే కోణంలో చూస్తూ, ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్లో భాగమేనంటారు చాలామంది.
ప్రజలకు సేవ చేయడం ద్వారా రాజకీయాల్లో రాణించాలన్న మౌళిక రాజకీయ సూత్రాన్ని పక్కన పెట్టి, అధికారంలోకి రావడానికి ఎలాంటి అడ్డదారులైనా తొక్కచ్చనేదే ప్రశాంత్ కిషోర్ వ్యూహాల వెనుక సీక్రెట్.. అని ఆయన్ని విమర్శించేవారంటుంటారు.
అయితే, ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishor) మాత్రం.. తాను తీసుకున్న ‘రెమ్యునరేషన్’కి న్యాయం చేయడమే తన బాధ్య తఅంటారు. తానేమీ రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టించేయలేదంటారు. కేవలం తన వల్లే ఆయా పార్టీలు గెలుస్తాయని కూడా తానెప్పడూ చెప్పనంటారు. ఆయా పార్టీలకు విలువైన సలహాలు ఇస్తుంటానంతే.. అన్నది ఆయన వెర్షన్.
ఇకపై ప్రశాంత్ కిషోర్, వ్యూహకర్తగా కనిపించరు. రాజకీయాల్లోకి మళ్ళీ వెళ్ళే అవకాశమూ లేదంటున్నారు. పశ్చిమబెంగాల్ (West Bengal), తమిళనాడుల్లో (Tamilnadu) తన వ్యూహాలు వర్కవుట్ అయ్యాక.. ‘వ్యూహకర్త’ (Prashant Kishor The Political Stratogist Says Good Bye) అనే బాధ్యతల నుంచి సగర్వంగా తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించడం గమనార్హం.