Home » ఎందుకెలా చనిపోయావ్.? నువ్వే చెప్పాలి ప్రత్యూష.!

ఎందుకెలా చనిపోయావ్.? నువ్వే చెప్పాలి ప్రత్యూష.!

by hellomudra
0 comments
Prathysha Mystery

Prathyusha Death Mystery Tollywood.. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించింది ఓ సినీ నటి.

అప్పుడప్పుడే సినీ రంగంలో అవకాశాలు సంపాదించుకుంటోన్న ఆమె, అనూహ్యంగా మరణించడంతో అంతా షాక్‌కి గురయ్యారు.

ప్రియుడితో కలిసి విషం సేవించి, ఆత్మహత్యకు పాల్పడిందన్నది అప్పట్లో ఆమె మరణం గురించి జరిగిన ప్రచారం.

కాదు కాదు, ఆమెను చంపేశారంటూ బోల్డన్ని ఆరోపణలు. ‘ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత పిరితనం ఆమెలో లేదు..’ అంటూ, ఆమె గురించి తెలిసినవాళ్ళంతా అభిప్రాయపడ్డారు.

హత్య మాత్రమే కాదు, హత్యాచారం కూడా.. అంటూ, ఆమె మరణంపై అనేక సందేహాలు తెరపైకొచ్చాయి. అయితే, ఆమెపై ఏ అఘాయిత్యమూ జరగలేదని ఆ తర్వాత ‘తేల్చారు’.!

Prathyusha Death Mystery Tollywood.. ఇరవై మూడేళ్ళ న్యాయ పోరాటం..

దాదాపు ఇరవై మూడేళ్ళుగా ఆమె తల్లి, తన కుమార్తె మరణానికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని పోరాటం చేస్తూనే వున్నారు.

ఎట్టకేలకు, ఇరవై మూడేళ్ళ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం, ఈ కేసులో ప్రధాన నిందితుడ్ని ‘లొంగిపోవాల్సిందిగా’ ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.

మృతురాలి పేరు ప్రత్యూష. ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన ‘కలుసుకోవాలని’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ప్రత్యూష.

ప్రత్యూష డెత్ మిస్టరీ కేసులో ప్రధాన నిందితుడి పేరు సిద్దార్ధ రెడ్డి. పలువురు రాజకీయ ప్రముఖుల పుత్ర రత్నాల కారణంగానే ప్రత్యూష చనిపోయిందన్నది ప్రధాన ఆరోపణ.

సదరు రాజకీయ ప్రముఖుల వారసులందరికీ, ఈ కేసులో గతంలోనే ఉపశమనం కలిగింది. సాక్ష్యాలు తారుమారు చేశారనీ, తన కుమార్తెది దారుణ హత్య అనీ.. ప్రత్యూష తల్లి ఇరవై మూడేళ్ళుగా నెత్తీనోరూ బాదుకుంటూనే వున్నారు.

ఇన్నేళ్ళ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో, కొంత ఊరట లభించినా.. పూర్తిస్థాయిలో న్యాయం జరిగినట్లు భావించడంలేదని ప్రత్యూష తల్లి చెబుతున్నారు.

ఇంతకీ, ప్రత్యూష ఎలా చనిపోయింది.? ఎందుకు చనిపోయింది.? స్వయంగా కోర్టుకి వచ్చి ప్రత్యూష చెప్పే అవకాశం లేదు కదా.!

కానీ, ఓ ఆడపిల్ల అనుమానాస్పద రీతిలో చనిపోతే.. ఆ కుటుంబానికి న్యాయం చేయలేని వ్యవస్థలు సిగ్గుతో తలదించుకోవాలి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group