Malaika Arora: ఆమె ముందు వయసు ఓడిపోయింది.!

Malaika Arora
Malaika Arora Glamorous Photos.. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.. అనే మాట తరచూ వింటుంటాం.! ఒకప్పుడు గ్లామర్ అంటే, జస్ట్ పాతికేళ్ళకే పరిమితమైపోయేది.. అందాల భామలకు సంబంధించి.
కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది.! గ్లామర్‌కి వయసుతో సంబంధం లేదు.! ఐదు పదుల వయసొచ్చినా, గ్లామర్ విషయంలో అస్సలు ‘తగ్గేదే లే’ అంటున్నారు.!

ఆ లిస్టులో మొదటి పేరు బహుశా మలైకా అరోరా అనుకోవచ్చేమో.! ఒకప్పుడు సీనియర్ నటి రేఖ అందం గురించి ఇలాగే మాట్లాడుకునేవాళ్ళు అందరూ.!
Malaika Arora Glamorous Photos.. ట్రెండింగ్ క్వీన్.!
ఇప్పుడైతే, మలైకా అరోరా హాటెస్ట్ సెన్సేషన్.! సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మలైకా అరోరా ఫొటోలు ట్రెండింగ్‌లో వుంటున్నాయి.!
ఆ నెటిజనం హృదయాల్ని కొల్లగొట్టడానికా.? అన్నట్టు వీలు చిక్కినప్పుడల్లా హాట్ అండ్ వైల్డ్ ఫొటో సెషన్‌తో సందడి చేస్తుంటుంది మలైకా అరోరా.

అయినా, ఐదు పదుల వయసులో మలైకా అరోరా (Malaika Arora) ఇంతలా గ్లామర్ ఎలా మెయిన్‌టెయిన్ చేస్తున్నట్లు.?
ఇదే ప్రశ్న ఆమె ముందుంచితే, ‘సంతోషంగా వుండడం వుండడం.. మంచి ఆహారం తీసుకోవడం.. తగినంత వ్యాయామం చేయడం’ అని చెబుతుంటుంది మలైకా అరోరా.!
బోర్ కొట్టేస్తోందిట.!
అన్నట్టు, ‘ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్’ అనే మాట తరచూ చెప్పడం తనకూ బోర్ కొట్టించేస్తోందని మలైకా (Malaika Arora) తాజాగా చెప్పుకొచ్చింది.
పెళ్ళయ్యింది, విడాకులు తీసుకుంది. ట్వంటీస్‌లోకి వచ్చేసిన కొడుకున్నాడు.! కానీ, తనకంటే చిన్న వయసువాడైన అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తోంది మలైకా.

అర్జున్ కపూర్ (Arjun Kapoor)తో పెళ్ళెప్పుడు.? అన్న ప్రశ్నకు అస్సలు సమాధానం చెప్పదామె.! ‘మేమిప్పుడు బాగానే వున్నాం కదా..’ అని ఎదురు ప్రశ్నిస్తుంటుంది మలైకా.!
Also Read: Divyansha Kaushik.. నవ్వితే ‘నవ’రత్నాల్.!
చూస్తున్నారుగా.. ఫొటోల్లో మలైకా అరోరా (Malaika Arora)ని చూస్తోంటే, జస్ట్ ట్వంటీస్ లేదా థర్టీస్ అన్నట్లుంది కదా.? అదే ఆమె ప్రత్యేకత.!
