Pre Photo Shoot Sache Din.. నీ మొహం మండ.! సచ్చ దిన్ ఏంట్రా బడుద్ధాయ్.! ఔను, సచ్చేదిన్ ఏంటి.? బుద్ధి లేకపోతేనూ.!
అయినా, అన్ని పనులూ బుద్ధితోనే చేస్తున్నామా.? బుద్ధిని పక్కన పడేసి, బుద్ధి హీనమైన పనులు ఎన్నెన్నో చేసేస్తున్నాం.!
ముహూర్తం పెట్టించుకుని మరీ, సిజేరియన్ చేయించేస్తోన్న రోజులివి. నార్మల్ డెలివరీ గురించి మర్చిపో.. సుముహూర్తం చూసి, కడుపు కోసి పడేసి.. బిడ్డను బయటకు తీస్తే, జాతకం వెలిగిపోతుందని నమ్మే కాలమిది.!
రాకెట్టేసుకుని అంతరిక్షంలోకి వెళుతూ, దానికోసం కూడా ముహూర్తాలు చూస్తున్నాం. ఈ కాలంలో వున్నాక, ఇంకా ‘బుద్ధి’ గురించి మాట్లాడుకుంటే ఎలా.?
ప్రీ షూట్.. పోయేకాలం.!
ప్రీ వెడ్డింగ్ షూట్.! పోస్ట్ వెడ్డింగ్ షూట్.! ప్రీ ప్రెగ్నెన్సీ షూట్.! పోస్ట్ ప్రెగ్నెన్సీ షూట్.! ప్రీ డెలివరీ షూట్.! పోస్ట్ డెలివరీ షూట్.! వామ్మో, ఎన్ని వున్నాయో కదా.?
డబ్బులు.. దాంతోపాటే, పైత్యాలూ పెరిగిపోతే.. ఇదిగో ఇలాగే వుంటుంది మరి.!

ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లూ ప్రాణాలు తీసేస్తున్నాయని తెలిసీ, వాటి వెంట పడటమే బుద్ధి హీనత. నెలలు నిండాక ప్రీ డెలివరీ షూట్.. అంటూ అడ్డమైన వేషాలూ వేయడం కూడా బుద్ధి హీనతే.!
ఇంతేనా, ఇంకా చాలా వున్నాయ్. అందులో, ప్రీ డెత్ షూట్ ఒకటి. అంటే, ‘సచ్చే’దిన్ కోసం ముందస్తుగానే రెడీ అయిపోయి, ఫొటో షూట్ చేసుకోవడమన్నమాట.
Pre Photo Shoot Sache Din.. స్మశానంలోనూ అదే పైత్యం.!
స్మశానంలో, ఎంచక్కా చితి మీదకు బతికుండగానే సరదాగా ఎక్కేసి, ఓ ఫొటో క్లిక్.. అనిపించేసుకుని, ‘పాడె మీద పడుకుని కూడా జీవకళ’తో కన్పించడమంటే ఆ కిక్కే వేరప్పా.. అనుకునేటోళ్ళు తయారయ్యారు.
శవ పేటికల కొరత నేపథ్యంలో, ముందస్తుగానే తమక్కావాల్సిన డిజైన్లలో వాటిని తయారు చేసకునే గొప్ప గొప్ప వ్యక్తులు నడయాడుతున్న కాలమిది. ఈ కాలంలో ప్రీ డెత్ షూట్లు జరిగితే తప్పేంటట.? తప్పేమీ లేదు.!
Also Read: Kangana Ranaut.. వామ్మో.! ఏం తెలివి.? క్లీన్ బౌల్డ్ చేసేస్తోందే.?
ఇప్పటికైతే, ఇలాంటి సిత్రాలు చూస్తున్నాం.! రానున్న కాలంలో ఇంకెన్ని సిత్ర విసిత్రాలు చూడబోతున్నామో.!