Home » ప్రివ్యూ: ‘అరవింద సమేత’ యంగ్‌ టైగర్‌

ప్రివ్యూ: ‘అరవింద సమేత’ యంగ్‌ టైగర్‌

by hellomudra
0 comments

సరికొత్త పాత్రలు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి (Jr NTR Nandamuri Taraka Ramarao) కొత్తేమీ కాదు. రికార్డులు (Preview Aravinda Sametha Veera Raghava) అసలే కొత్త కాదు. నూనూగు మీసాల వయసులోనే, వసూళ్ళ ప్రభంజనం సృష్టించాడీ యంగ్‌ టైగర్‌ (Young Tiger NTR).

ఇటీవలి కాలంలో విభిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నుంచి ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

‘టెంపర్‌’ (Temper), ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho), ‘జనతా గ్యారేజ్‌’ (Janatha Garage), ‘జై లవ కుశ’ (Jai Lavakusa).. ఈ సినిమాల్ని తీసుకుంటే, యంగ్‌ టైగర్‌ పక్కా ప్లానింగ్‌తో తన కెరీర్‌లో కొత్త పేస్‌తో దూసుకుపోతున్నాడని అన్పించకమానదు.

అలాంటి యంగ్‌ టైగర్‌ (Young Tiger NTR) నుంచి వస్తోన్న ‘అరవింద సేమత’ సినిమా వసూళ్ళ రికార్డులు సృష్టించడం సాధారణమేనని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమా కోసం యంగ్‌ టైగర్‌ ఎలాంటి కొత్త పాత్రని ఎంచుకున్నాడు? అనే ఉత్కంఠ మాత్రమే అభిమానుల్లో వుందిప్పుడు.

అసలు ఏముంది ‘అరవింద సమేత’ సినిమాలో! Preview Aravinda Sametha Veera Raghava

రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ సినిమాలో ‘రా’ లుక్‌ కన్పిస్తోంది. టీజర్‌, ట్రైలర్‌ ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పాతికేళ్ళు నిండకుండానే ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసి, రికార్డు వసూళ్ళను కొల్లగొట్టిన ఘనుడు యంగ్‌ టైగర్‌.

దాంతో, ‘అరవింద సమేత’లో ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ అతనికి కొత్త అని అనుకోవడానికి వీల్లేదు. కానీ, ఏదో కొత్తదనం వుండబట్టే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఈ సినిమాని యంగ్‌ టైగర్‌ చేశాడు.

కత్తి పట్టడం కొత్త కాదు ఎన్టీఆర్‌కి (Young Tiger NTR). కానీ, ఆ కత్తి పట్టి ఏం సాధించాడన్నదే ఈ అరవింద సమేత (Aravinda Sametha Veera Raghava) సినిమాలో కొత్తగా చూపించబోతున్నారట.

ఒక్కో పాత్ర తీరు తెన్నులూ ఒక్కోలా వున్నాయ్‌.. Preview Aravinda Sametha Veera Raghava

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రాయలసీమ ఫ్యాక్షనిజంపై బోర్‌ కొట్టి, ప్రశాంతత కోసం హైద్రాబాద్‌ వచ్చే కుర్రాడిలా కన్పించబోతున్నాడట. ఎన్టీఆర్‌ తండ్రి పాత్రలో మెగా బ్రదర్‌ నాగబాబు కన్పించబోతున్నట్లు తెలుస్తోంది. జగపతిబాబు, ఈ సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో సత్తా చాటబోతున్నాడు.

సీనియర్‌ నటుడు నరేష్‌, హీరోయిన్‌ పూజా హెగ్దే తండ్రి పాత్రలో నటించాడట. ఎన్టీఆర్‌కి హైద్రాబాద్‌లో ఆశ్రయం కల్పించే వ్యక్తి పాత్రలో సునీల్‌ని చూడబోతున్నామట. విలన్‌ జగపతిబాబు కొడుకు పాత్రలో నవీన్‌ చంద్ర నటించాడని సమాచారమ్‌. ఇవీ పాత్రలు. వీటితోపాటు చాలా పాత్రలే సినిమాలో కన్పించబోతున్నాయి.

ఎందుకంటే, ఇది త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) సినిమా. ఆయన సినిమాల్లో చాలా పాత్రలుంటాయి. చిన్న పాత్రకీ ఎంతో కొంత ప్రాధాన్యత వుంటుంది. అదే త్రివిక్రమ్‌ ప్రత్యేకత.

డాన్సులు, ఫైట్లు.. యంగ్‌ టైగర్‌కి కొత్త కాదు కదా!

సినిమాలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అద్భుతంగా డాన్సులేయడానికి రెండు పాటలున్నాయి (Preview Aravinda Sametha Veera Raghava). ఒకటి అనగనగా.. అయితే ఇంకోటి రెడ్డీ.. ఇటు సూడు. ఈ రెండు పాటల్లోనూ యంగ్‌ టైగర్‌ డాన్సులు ఇరగదీసేశాడు.

హీరోయిన్‌తో యంగ్‌ టైగర్‌ కెమిస్ట్రీ కూడా ఈ పాటల్లో అదిరిపోయింది. మిగిలిన రెండు పాటలూ సిట్యుయేషనల్‌ సాంగ్స్‌. యంగ్‌ టైగర్‌ డాన్సులేసే పాటల కంటే, సిట్యుయేషనల్‌గా వచ్చే పాటలకే ఎక్కువ స్పందన లభిస్తోంది ఆడియో ఆల్బమ్‌లో. అదీ ఆ ప్రత్యేకమైన పాటల ప్రత్యేకత అని అనుకోవాలి.

ముఖ్యంగా ‘పెనివిటి’ పాటకి వస్తున్న రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. సినిమా ఆల్రెడీ హిట్టయ్యిందన్న భావన విడుదలకు ముందే కల్పించింది ‘పెనివిటి’ సాంగ్‌.

ప్రయోగం.. యంగ్‌ టైగర్‌ నినాదం

‘టెంపర్‌’ రొటీన్‌ సినిమా కాదు. ‘నాన్నకు ప్రేమతో’ కూడా అంతే. ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో కొత్త యంగ్‌ టైగర్‌ని చూశాం. ‘జై లవ కుశ’ సినిమాలో యంగ్‌ టైగర్‌ త్రిపాత్రాభినయానికి ఫిదా అయిపోయాం.

ఇప్పుడీ ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) ప్రాజెక్ట్‌ని ఎంచుకున్నందుకే యంగ్‌ టైగర్‌కి హేట్సాఫ్‌ చెప్పాల్సి వుంటుంది. ఆ స్థాయిలో ఈ సినిమా విజయం సాధించబోతోందన్నది సినిమా యూనిట్‌ చెబుతున్న మాట.

స్నేహితుడు త్రివిక్రమ్‌తో సినిమా చేసే అవకాశం ఎప్పుడో వచ్చినా, తమ కాంబినేషన్‌లో ఓ అద్భుతం తెరకెక్కాలన్న భావనతో కొంత టైమ్‌ తీసుకున్నాడట ఎన్టీఆర్‌. ఆ అద్భుతాన్ని తెరపై చూడ్డానికి అభిమానులూ సిద్ధంగానే వున్నారు.

అంచనాలకు ఆకాశమే హద్దు

యంగ్‌ టైగర్‌ సినిమాకి అంచనాలు ఆకాశాన్నంటేయడం మామూలే. కనీ వినీ ఎరుగని అంచనాలు.. అన్నదీ చిన్న మాటే. అంతకన్నా పెద్ద పెద్ద మాటలు ఉపయోగించాలేమో సినిమాపై క్రియేట్‌ అయిన హైప్‌ గురించి. దాన్ని తగ్గించడానికే యంగ్‌ టైగర్‌ అండ్‌ టీమ్‌ కొంత లో ప్రొఫైల్‌ మెయిన్‌టెయిన్‌ చేసింది.

సైలెంట్‌గా వచ్చి, బీభత్సమైన హిట్‌ కొట్టబోతున్నామంటూ యంగ్‌ టైగర్‌ తన సన్నిహితులకు ఇప్పటికే సంకేతాలు పంపేశారు. ఆకాశాన్నంటేసిన అంచనాలు.. రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. రికార్డు స్థాయిలో ఫస్ట్‌ డే స్క్రీనింగ్‌.. ఇంతకు మించి ఏ పెద్ద సినిమాకి అయినా కావాల్సింది ఇంకేముంటుంది.?

ఓవర్సీస్‌లో దుమ్ము దులిపేయడానికి, తెలుగు రాష్ట్రాల్లో రికార్డు వసూళ్ళను సాధించడానికీ ‘అరవింద సమేత’ (Preview Aravinda Sametha Veera Raghava) రెడీ అయిపోయింది. ఈ రోజు అర్థ రాత్రి నుంచే షోలు పడిపోనున్నాయ్‌. ఆల్రెడీ సినిమాకి పాజిటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయిపోయింది.

ఇక రికార్డుల గురించి మాట్లాడుకోవడమే తరువాయి. ఆల్‌ ది బెస్ట్‌ టు అరవింద సమేత.

ఫైనల్ రివ్యూ.. కొద్ది సమయంలో…

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group