Table of Contents
ఒకటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ఇంకోటి ఫక్తు మాస్ మసాలా సినిమా.. ఈ రెండూ ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి. ఇంతకీ, ఈ ఇద్దరిలో గెలుపెవరిది.? ఒకరేమో ‘రాక్షసుడు’ (Rakshasudu) అంటున్నారు.. (Preview Rakshasudu Guna369 Sivaranjani) ఇంకొకరేమో ‘గుణ’వంతుడినని (Guna 369) చెబుతున్నారు.
అసలు ‘రాక్షసుడు’ (Rakshasudu Movie) ఎవరు.? ‘గుణ’వంతుడి సత్తా ఎంత.? (Guna Movie) ఇంతకీ, ‘గుణ’ సినిమాలో నెంబర్ 369కి వున్న సీన్ ఏంటి.? అన్నట్టు, రష్మి (Rashmi Gautham) ప్రధాన పాత్రలో నటించిన ‘శివరంజని’ ఏమవుతుంది.? ఇలా చాలా ప్రశ్నలున్నాయి.
అన్ని ప్రశ్నలకూ మరికొద్ది గంటల్లో సమాధానం దొరుకుతుంది. ఆయా సినిమాలకు (Rakshasudu Guna 369 Sivaranjani) సంబంధించి ప్రివ్యూ ఒక్కసారి చూసేద్దామా.!
రాక్షసుడు.. ఏం చేస్తాడు.? (Preview Rakshasudu Guna369 Sivaranjani)
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’, తమిళ సినిమా ‘రాక్షసన్’కి అఫీషియల్ రీమేక్. ఒరిజినల్ ఫ్లేవర్‌ని ఏమాత్రం దెబ్బ తీయకుండా, మన నేటివిటీకి దగ్గరగా సినిమాని తెరకెక్కించామని దర్శకుడు రమేష్ వర్మ (Ramesh Varma) చెబుతున్నారు.
సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), ఈ సినిమాతో ఒకింత ప్రయోగం చేసినట్లే కన్పిస్తోంది. బెల్లంకొండ సురేష్ సరసన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నటించడం గమనార్హం.
రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా అడుగులు ప్రారంభించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Srinivas), ఈ సినిమాతో హిట్టు కొడతాడా.? కొడతాడనే అంటోంది ‘రాక్షసుడు’ టీమ్. సినిమా కోసం చాలా కష్టపడ్డామనీ, చాలా కాన్ఫిడెంట్‌గా సినిమా విజయం కోసం ఎదురుచూస్తున్నామని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు.
ప్రోమోస్ ఇప్పటికే సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసేశాయి. అయితే, ఆల్రెడీ తమిళ వెర్షన్ ‘రాక్షసన్’ (Ratchasan) ని చాలామంది చూసేశారు. దాంతో, ‘రాక్షసుడు’ సినిమాకి ఏ స్థాయిలో ఫస్ట్ డే క్రౌడ్ వుంటుందన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.
తమిళంలో విజయవంతమైన చాలా సినిమాలు తెలుగులో విడుదలకు ముందు క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి గనుక, సినిమా యూనిట్ ‘రాక్షసుడు’ (Rakshasudu Bellamkonda Srinivas)పై చాలా పాజిటివ్ దృక్పథంతో కనిపిస్తోంది.
‘గుణ 369’లో అది వుండదా.?
ఇక, ‘గుణ’ (Guna 369) సినిమా విషయానికొస్తే.. దీని కథ వేరు. టైటిల్ ‘గుణ 369’. ఈ ‘369’ సంగతేంటో సినిమా చూస్తే తెలుస్తుంది. అది, సినిమాలో హీరో ఖైదీగా వున్నప్పటి నెంబర్.. అంతేనా, ఇంకేమన్నా ప్రత్యేకతలు ఈ నెంబర్‌కి వున్నాయా.!
ఆ విషయం పక్కన పెడితే, ‘ఆర్‌ఎక్స్ 100’తో (RX100) సూపర్ హిట్ అందుకుని, హీరోగా బోల్డంత పాపులారిటీ సంపాదించుకున్న కార్తికేయ హీరోగా నటించిన చిత్రమిది. మధ్యలో ‘హిప్పీ’ (Hippie) సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన కార్తికేయ, ‘గుణ 369’ సినిమా మాత్రం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని చెబుతున్నాడు.
ఫక్తు కమర్షియల్ సినిమానే అయినా, సినిమా గమనం కొత్తగా వుంటుందన్నది కార్తికేయ చెబుతున్న మాట. అనగ అనే అందమైన భామ ఈ సినిమాలో హీరో సరసన నటిస్తోంది. ‘ఆర్‌ఎక్స్ 100’, ‘హిప్పీ’ సినిమాల్లోలా ఓవర్ డోస్ రొమాన్స్ వుండదని కార్తికేయ (Karthikeya) చెబుతున్నా, అది నిజమేనా.? అన్న అనుమానాలైతే అలాగే వున్నాయి. కార్తికేయ మీద జనానికి వున్న అంచనాలు అలాంటివి మరి.
శివరంజని.. ఆమె కోసం మాత్రమే..
అన్నట్టు, ‘రాక్షసుడు’ (Rakshasudu), ‘గుణ 369’ (Guna 369) సినిమాలతోపాటు, రష్మి నటించిన ‘శివరంజని’ (Sivaranjani) కూడా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఇతర తారాగణం ఎవరు.? దర్శకుడి మాటేంటి.? నిర్మాతల సంగతేంటి.? ఇవన్నీ జనానికి అనవసరం.
ఎందుకంటే, అక్కడ రష్మి మాత్రమే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అయితే, ఇటీవల రష్మి కూడా సరిగ్గా స్కోర్ చేయలేకపోతోంది. ప్రోమోస్‌లో రష్మి ఒకింత ఆకట్టుకుంటుండడం ఈ సినిమాకి కొద్దో గొప్పో కలిసొచ్చే అంశం. మూడు భిన్నమైన సినిమాలు.. అందులో రెండు చెప్పుకోదగ్గ రిలీజులు.. ఒకటి సందట్లో సడేమియా అని వచ్చిన సినిమా. చూద్దాం.. ఈ వీక్ బాక్సాఫీస్ (Preview Rakshasudu Guna369 Sivaranjani) ఏమవుతుందో.!