Table of Contents
‘సవ్యసాచి’ అంటే అర్జునుడు అని. ఇక్కడ ఈ ‘సవ్యసాచి’ ఒక్కడే.. కానీ, ఇద్దరు. ఒక్కడేంటి, మళ్ళీ ఇద్దరేంటి.! అదే ‘సవ్యసాచి’ సినిమా. తల్లి గర్భంలో రెండు కవల పిండాలు, ప్రత్యేక పరిస్థితుల్లో ఒక్కటవుతాయి. దీనికి దర్శకుడు ఓ సరికొత్త ‘మెడికల్ టెర్మినాలజీ’ని ఉపయోగించి సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశాడు. దాంతో, ‘సవ్యసాచి’ రొటీన్ సినిమా కాదు, ఇందులో ఏదో కొత్తగా వుండబోతోందని అంతా అనుకున్నారు. ‘సవ్యసాచి’ టీజర్‌తో సీక్రెట్‌ని కాస్త రివీల్ చేసి, సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసేశారు దర్శక నిర్మాతలు.
టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తే, ట్రైలర్ మేగ్జిమమ్ అలరించేసింది. బోల్డంత ఫన్, కావాల్సినంత ఇంట్రెస్టింగ్ థీమ్.. వీటికి తోడు, అక్కినేని నాగార్జున గతంలో నటించిన ‘హలోబ్రదర్’ సినిమా తాలూకు షేడ్స్.. వెరసి, ‘సవ్యసాచి’ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పుడీ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. కొద్ది సేపట్లో సినిమా రిజల్ట్ ఏంటో తేలిపోనుంది. అసలు ‘సవ్యసాచి’ కథేంటి, సినిమాపై వున్న అంచనాలేంటి.? ప్రీ రిలీజ్ విశేషాలేంటి.? ‘ప్రివ్యూ’లో తెలుసుకుందాం.
లవర్ బోయ్ మాధవన్.. తొలిసారి తెలుగులో..
తెలుగులోకి డబ్ అయిన కొన్ని తమిళ సినిమాలతో మాధవన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అందగాడు.. అమ్మాయిల కలల రాకుమారుడు. ఈ సినిమా కోసం నెగెటివ్ రోల్‌లోకి మారాడు. నిజానికి మాధవన్ విలక్ష నటుడు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసెయ్యగల సత్తా వున్నోడు. అయితే, అంత ఈజీగా మాధవన్‌ని ఎవరూ ఒప్పించేయలేరు. బలమైన కథ వుంటే తప్ప, మాధవన్‌ని ఒప్పించడం కష్టం. అలాంటిది, దర్శకుడు చందూ మొండేటి, మాధవన్‌ని ఎలా ఒప్పించాడట.? ఒప్పించాడంటే.. సినిమాలో ‘మేటర్’ చాలా స్ట్రాంగ్‌గానే వుండి వుండాలి.
బాలీవుడ్ అందాల ‘నిధి’ టాలీవుడ్‌కి వచ్చిందోచ్
బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ తెలుగులోకి ఈ ‘సవ్యసాచి’తోనే ఎంట్రీ ఇస్తోంది. తెలుగు తెరపై ఆమెకు ఇదే తొలి సినిమా. తొలి సినిమానే అక్కినేని కాంపౌండ్‌లోని హీరోతో దక్కించుకున్న నిధి అగర్వాల్, రెండో సినిమాని కూడా ఇదే కాంపౌండ్‌లోని మరో హీరోతో చేస్తోంది. తొలి సినిమా ‘సవ్యసాచి’ కాగా, రెండో సినిమా ‘మిస్టర్ మజ్ను’. ‘సవ్యసాచి’లో అక్కినేని నాగచైతన్యతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదరగొట్టేసిన ఈ బ్యూటీ, రెండో సినిమా ‘మిస్టర్ మజ్ను’లో అక్కినేని అఖిల్‌తో అదరగొట్టేయబోతోందట.
అన్నట్టు, నిధి అగర్వాల్ చాలా మంచి డాన్సర్. ఆమెతో పోటీ పడి డాన్స్ చేయడం కోసం అక్కినేని నాగచైతన్య కూడా తొలిసారిగా డాన్సుల్లో తన సత్తా చాటేశాడు. ఇప్పటిదాకా ఏ సినిమాలో చేయనంత ఈజ్‌తో ఈ సినిమా కోసం నాగచైతన్య చేసిన డాన్సులు చూసి అంతా అవాక్కవుతున్నారంటే అది అతిశయోక్తి కాబోదు. ఇటు గ్లామర్‌తోనూ, అటు డాన్సులతోనే కాదు, నటనతోనూ నిధి తొలి సినిమాతోనే తెలుగు నాట బలమైన ముద్ర వేయాలనుకుంటోంది.
చందూ మొండేటి తక్కువోడేం కాదు.!
‘కార్తికేయ’ సినిమా గుర్తుంది కదా.? అదొక థ్రిల్లర్. సూపర్బ్‌గా హ్యాండిల్ చేసి తొలి సినిమాతోనే హిట్ కొట్టేసి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడీ యంగ్ డైరెక్టర్. ఆల్రెడీ నాగచైతన్యతో ‘ప్రేమమ్’ సినిమా చేసిన ఈ యంగ్ డైరెక్టర్, ఇప్పుడు రెండోసారి నాగచైతన్యతో ఈ ‘సవ్యసాచి’ సినిమా చేస్తున్నాడు. ఈసారి హిట్ పక్కా.. అంటున్నాడీ యువ దర్శకుడు. ఈ సినిమా తర్వాత ‘కార్తికేయ-2’ కోసం ప్లాన్ చేస్తున్నాడు చందూ. అంతే కాదండోయ్, అక్కినేని నాగార్జునతోనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట.
మైత్రీ మూవీ మే’కింగ్’!
భారీ చిత్రాలకు పెట్టింది పేరు మైత్రీ మూవీ మేకర్స్. అంతే కాదు, మీడియం బడ్జెట్ చిత్రాలు, చిన్న చిత్రాలైనా వెనుకాడని ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సవ్యసాచి’ సినిమా కోసం నాగచైతన్య బాక్సాఫీస్ స్టామినాకి మించి ఖర్చు చేసిందంటే, ఈ సినిమాపై చిత్ర నిర్మాతలకు ఏ స్థాయిలో నమ్మకం వుందో అర్థం చేసుకోవచ్చు. టీజర్, ట్రైలర్, సాంగ్ ప్రోమోస్, కామెడీ ప్రోమోస్ (సుభద్ర పరిణయం ఎపిసోడ్) ఇప్పటికే సూపర్ హిట్ అవడంతో.. సినిమా కూడా సూపర్ హిట్ అన్న భావన ఆల్రెడీ అందరిలోనూ కలుగుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. సినిమా చూసేద్దామిక.!
ఫైనల్ రివ్యూ.. కాస్సేపట్లో. అప్‌డేట్స్ కోసం చూస్తూనే వుండండి..