నటి ప్రియమణి ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే. వీరిది మతాంతర వివాహం. అయితేనేం, తామిద్దరం ఎంతో అన్యోన్యంగా వుంటున్నామని పలు ఇంటర్వ్యూల్లో ప్రియమణి (Priyamani Mustafa Raj Marriage Controversy) చెబుతూ వచ్చింది. ప్రియమణి భర్త పేరు ముస్తఫా రాజ్. వ్యాపారవేత్త ఆయన. సినీ పరిశ్రమతో అస్సలేమాత్రం సంబంధం లేదు.
ట్విస్ట్ ఏంటంటే, ముస్తఫా రాజ్ (Musthafa Raj) మొదటి భార్య అయేషా కోర్టుకెక్కింది. తన భర్త తనకు విడాకులివ్వకుండానే ప్రియమణిని పెళ్ళాడి, ఆమెతో వైవాహిక జీవితాన్ని గడుపుతున్నాడని ఆరోపిస్తోంది. దాంతో, ప్రియమణి అలాగే ఆమె భర్త మస్తఫా రాజ్ తాజా వివాదంపై వివరణ ఇచ్చుకోక తప్పడంలేదు.
ముస్తఫా రాజ్ (Mustafa Raj) అయితే, తన మొదటి భార్య అయేషాతో (Ayesha Raj) విడిపోయి చాలాకాలం అయ్యిందనీ, అయేషాతో తనకు కలిగిన సంతానం తాలూకు బాగోగుల్ని ఇప్పటికీ తానే చూసుకుంటున్నాననీ, అప్పట్లో విడాకులకు అంగీకరించిన అయేషా ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతోందో తనకు అర్థం కాలేదని వాపోతున్నాడు.
Also Read: విడాకులూ బ్రేకప్పూ వాట్సప్పూ.?
కాగా, ముస్తఫా రాజ్‌తో తన వైవాహిక బంధం బాగానే నడుస్తోందనీ, ప్రస్తుతం విదేశాల్లో వున్న ముస్తఫా త్వరలోనే ఈ వివాదంపై పూర్తిస్థాయిలో సమాధానమిస్తాడనీ ప్రియమణి (Priyamani) చెప్పుకొచ్చింది.
Also Read: డేటింగుల్లోనూ పొట్టీ.. పొడుగూ.!
అయినా, సినీ పరిశ్రమలో ఇలాంటివన్నీ సర్వసాధారణమైపోయాయ్. ఆ మాటకస్తే.. ఇలాంటి వ్యవహారాలు సాధారణ పౌర సమాజంలోనూ ఈ మధ్య ఎక్కువగానే వినిపిస్తున్నాయి. సెలబ్రిటీల వ్యవహారాలు కదా.. కాస్త ఎక్కువ పాపులర్ అవుతుంటాయంతే.