ఇదేదో ఇంగ్లీష్ పదం మాకెందుకు తెలుస్తుంది అనుకుంటున్నారా.? పదం (ProBiotics Health Benifits) ఇంగ్లీషే అయినా.. అందరికీ పరిచయం వున్న ప్రక్రియేనండోయ్.
అసలేంటీ ప్రో బయోటిక్స్ అంటే.? అనుకుంటున్నారా.? శరీరానికి మేలు చేసే ఓ రకం బ్యాక్టీరియానే వైద్య పరిభాషలో ‘ప్రో బయోటిక్స్’ అంటారు.
మన శరీరంలో చెడు బ్యాక్టీరియాతో పాటూ, మంచి బ్యాక్టీరియా కూడా వుంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మనం తీసుకునే ఆహారం ద్వారానే ఈ మంచి బ్యాక్టీరియా అనేది మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఏంటా ఆహారం.? అసలేంటీ కథ.?
ProBiotics Health Benifits.. పులియబెట్టిన ఆహారమే..
మినప పిండితో చేసే ఇడ్లీ, దోశె, ఊతప్పం తదితర ఆహార పదార్ధాలు ఈజీగా జీర్ణమయ్యే శక్తిని కలిగి వుండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ్. అందుకు కారణం ఏంటో తెలుసా.?
అందులో వుండే ప్రో బయోటిక్స్. అదేనండీ మంచి బ్యాక్టీరియా. మనం తీసుకునే ఇడ్లీ తదితర పులియబెట్టిన ఆహార పదార్ధాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి పేగుల్లో నివాసముంటుంది ఈ బ్యాక్టీరియా.

పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతూ, జీర్ణ శక్తి ఈజీగా అయ్యేందుకు తోడ్పడుతుంటుంది. అలా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా వుండేందుకు ఈ ప్రో బయోటిక్స్ ఉపయోగపడతాయన్న మాట.
పెరుగులోనూ..
జీర్ణక్రియ సరిగ్గా లేక సంభవించే సాధారణ సమస్యలైన విరేచనాలు, కడుపునొప్పి, వాంతులు తదితర అనారోగ్య సమస్యల సమయంలో వైద్యులు సూచించే ట్యాబ్లెట్లూ, సిరప్‌లలో వుండే మందు ఈ ప్రో బయోటిక్‌నే.
పులియబెట్టే ప్రాసెస్‌లో తయారయ్యే ఇడ్లీ, దోశె తదితర పౌష్టిక ఆహారమే కాదండోయ్. పెరుగు కూడా ఈ కోవలోకే చెందుతుంది.
Also Read: యుద్ధ విమానంపై హనుమాన్.! ఎందుకీ కాంట్రవర్సీ.!
అయితే, పులిసిన పెరుగును చాలా మంది ఇష్టపడరు. అందుకే ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగును మాత్రమే ఎక్కువగా వాడుతుంటారు.
కానీ ఫ్రిజ్‌లో వుంచిన పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఒరిగేదేమీ లేదట, పులియబెట్టిన పెరుగులోనే అసలు సిసలు ఆరోగ్యం వుందంటున్నారు సంబంధిత వైద్య నిపుణులు.