Pulusu Paapa Blade Babji.. పేర్లెందుకుగానీ, ఆమె ఓ సినీ నటి, రాజకీయాల్లో కూడా వున్నారు.! బాధ్యతగల పదవిలోనూ వున్నారామె.! ఆమెని ‘పులుసు’ అనేశాడో సినీ నటుడు.
కేవలం నటుడు మాత్రమే కాదు, రాజకీయ నాయకుడు కూడా.! అంతే కాదు, ఆయన సినీ నిర్మాత కూడాను.!
రాజకీయాల్లో విమర్శలు సహజం.! నోరున్నోడిదే ఊరు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఆమె తక్కువదేం కాదు.. నోరు తెరిస్తే ఛండాలం.!
డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకెళ్ళి తొడకొడితే.. అంటూ డైలాగులు పేల్చుతుంటుంది.! అంతేనా, ‘నన్నెవడైనా రేప్ చేయగలడా.?’ అని సవాల్ కూడా విసురుతుంటుంది.
Pulusu Paapa Blade Babji.. ఏంటి బాబ్జీ మరీనూ..
ఇక్కడ, సదరు సినీ నటుడి గురించీ మాట్లాడుకోవాలి. ‘బ్లేడ్ బాబ్జీ’ అనే ముద్దు పేరుంది అతగాడికి.!
మొదట్లో కమెడియన్.! గట్టిగానే సంపాదించాడు. అదీ, ఓ రాజకీయ నాయకుడి సాయంతో. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలతోనూ సత్సంబంధాలున్నాయ్.
లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్నాడట.! అద్గదీ సంగతి.! ఆ నటి, ఓ ఉన్నత పదవిలో వున్న రాజకీయ నాయకుడ్ని విమర్శించే సరికి, ఈ నటుడు గుస్సా అయ్యాడు.
అదీ సంగతి.! తిట్టుకున్నోళ్ళకి తిట్టుకున్నంత రాజకీయాల్లో.! మీడియా ఎలాగూ వుంది పండగ చేసుకోవడానికి.
మీడియా కాదు.. మాఫియా..
ఎవడన్నా మంచి పని చేస్తే, అస్సలు మీడియా చూపించదు.! ఇదిగో, ‘పులుసు, డైమండ్ రాణి’ అనే కామెంట్లకు మాత్రం విపరీతమైన మైలేజ్ ఇస్తుంటుంది.
అసలు మీడియా ఎక్కడుంది.? ఇప్పుడు నడుస్తున్నదంతా పాత్రికేయ వ్యభిచారం అయితేనూ.! అందుకే, రాజకీయ నాయకులూ చెలరేగిపోతున్నారు.
Also Read: బాబు ఇచ్చాడా? జగన్ ఇస్తున్నాడా? నిజమెవరైనా చెప్పగలరా?
నాన్సెన్స్.. రాజకీయం ఎక్కడుంది.? రాజకీయ నాయకులెక్కడున్నారు.? అంతా ట్రాష్.! నడుస్తున్నది రాజకీయం ముసుగులో ఓ సిగ్గుమాలిన నాటకం.!
అన్నట్టు.. పేర్లు ప్రస్తావించలేక కాదు.! ఇష్టం లేక.! వీళ్ళు రాజకీయం చేయడమేంటి సిగ్గు లేకపోతేనూ.! సిగ్గూ యెగ్గూ వదిలేసిన రాజకీయం.! సిత్రంగా, జనాలకేమో అస్సలు బాధ్యత లేకుండా పోతోంది.!