Punugu Pilli Asian Civet Cat.. పిల్లుల్లో ఈ జాతి అత్యంత ప్రత్యేకం. వీటిని సివెట్ అనీ, ఏసియన్ సివిట్ అనీ, సివిట్ క్యాట్ అనీ పిలుస్తారు.
అయితే, అంతరించిపోతున్న ఈ జాతి పిల్లుల స్వేధమంటే దేవ దేవుడు శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామికి చాలా చాలా ఇష్టమట.
పిల్లుల స్వేధమేంటీ.. అనుకుంటున్నారా.? అవునండీ పునుగు పిల్లుల శరీరం నుంచి ఓ ప్రత్యేకమైన ద్రవం విడుదలవుతుంది. దీన్నే ‘పునుగు తైలం’ అంటారు.
ఈ తైలాన్ని దేవ దేవుని అభిషేకంలో విశిష్టంగా ఉపయోగిస్తారు. వారానికోసారి ప్రత్యేకంగా సేకరించిన ఈ తైలంతో వేంకటేశ్వరస్వామికి విశేషమైన అభిషేకం నిర్వహిస్తారు.
Punugu Pilli Asian Civet Cat.. అసలేంటీ.? పునుగు తైలం.?
సివెట్ క్యాట్ అలియాస్ పునుగు పిల్లులకు పెరినియల్ గ్రంధులుంటాయి. వీటి నుంచి స్రవించిన ద్రవం సుగంధ సువాసనలు వెదజల్లుతుంది.
పునుగు పిల్లులకు రెండేళ్ల వయసు వచ్చినప్పటి నుంచి వాటి శరీరం నుంచి ఈ గ్రంధులు సువాసనగొలిపే తైలాన్ని విసర్జిస్తాయ్.
ఆ సమయంలో అవి చెట్లను, రాళ్లను తాకుతూ తమ శరీరాన్ని రాపిడి చేస్తాయ్. అలా వాటికి అంటుకున్న ఆ ద్రవం కాసేపటికి గట్టిపడి జిగురుగా మారుతుంది.
సుగంధమే కాదు, ఔషధం కూడా..
ఈ జిగురు వంటి తైలాన్ని తితిదే అధికారులు ప్రత్యేకంగా సేకరించి, భద్రపరుస్తారు. ప్రతీ శుక్రవారం ఈ సుగంధ తైలంతో స్వామివారికి అభిషేకం చేస్తారు.
ఈ తైలంతో అభిషేకించడం వల్ల స్వామి వారి విగ్రహం ఎప్పుడూ తేజోవంతంగా మెరిస్తూ వుంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: దేవసేనకి మించి.. కనకవతి.! రుక్మిణి మేనియా.!
స్వామివారి సేవలో పునుగు తైలాభిషేకానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత వుంది. అరుదుగా మాత్రమే లభించే ఈ పునుగు తైలం అత్యంత ఖరీదైనది.
ఈ తైలం కేవలం సుగంధ ద్రవ్యమే కాదు, ప్రత్యేకమైన ఔషధ గుణాలు కలిగి వున్నది కూడా. దీర్ఘకాలికి నొప్పులు ఈ సుగంధ తైలంతో నివారణ అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పునుగు పిల్లలు అంతరించిపోయే దశలో వున్నాయి. చాలా చాలా అరుదుగా మాత్రమే ఇవి లభ్యమవుతుంటాయి. వీటి సంరక్షణ నిమిత్తం అనేక చర్యలు చేపడుతున్నారు.
