Table of Contents
Artificial General Intelligence.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించిన చర్చే జరుగుతోంది. స్మార్ట్ ఫోన్లలో ఈ ‘ఏఐ’ సంబంధిత యాప్స్ అందుబాటులోనే వున్నాయ్.
కొత్తగా, ఈ ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏంటి.? ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కి తదుపరి అప్డేట్ ఇదేనా.? దీంతో లాభాలేమిటి.? నష్టాలేమిటి.?
ఔను, ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అబ్బే, కష్టం.. అనేవారూ వున్నారు. కష్టమేం కాదు, త్వరలోనే చూస్తామని కొందరంటున్నారు.
Artificial General Intelligence.. అప్‌డేట్ కాదుగానీ..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటిదే, ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా. కాకపోతే, దానికీ దీనికీ చాలా తేడా వుంది.
వాస్తవానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొంతవరకు మన అదుపాజ్ఞల్లో వుంటుంది. కానీ, ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అందుకు పూర్తి భిన్నం.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి తయారు చేసే రోబో, పూర్తిగా మనం ఎలా చెబితే అలానే నడుచుకుంటుంది.. సాఫ్ట్‌వేర్ మాల్‌ఫంక్షన్ ఏదైనా జరిగితే తప్ప.!

ఏదన్నా సమస్య వచ్చినా, వెంటనే మనం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోని అదుపు చేయగలుగుతాం. దానికి తగ్గ ప్రిపరేషన్స్ ముందుగానే మనం చేసుకుని వుంటాం.
అన్నట్టు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోకి, తనంతట తానుగా ఆలోచించే శక్తి వుండదు. మనం ఏ ప్రోగ్రామ్ దానికి ఇస్తామో, దానికి అనుగుణంగానే పనిచేస్తుందది.
ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ లెక్క వేరు..
ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వ్యవహారం వేరేగా వుంటుంది. అసలు దీన్ని తయారు చేయడంలోనే ఇబ్బందులు ఎదురవుతాయన్న వాదన ఒకటుంది.
ఎందుకంటే, ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, తనకు తానుగా ఆలోచించగలుగుతుంది. మన అదుపాజ్ఞల్లో అస్సలు వుండదు. అదే అతి పెద్ద సమస్య.
అందుకే, తయారీ సమయంలోనే సమస్యలొస్తాయ్.. మన ప్రోగ్రామ్‌కి అనుగుణంగా అది నడచుకునే పరిస్థితి వుండదు. అలాంటప్పుడు, ముందడుగు ఏ ధైర్యంతో వేయగలం.?
తనకు తానుగా ఆలోచించేస్థాయికి, ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రోబోని మనం తీసుకెళ్ళగలమా.? అన్నదీ ఓ ప్రశ్నే. కానీ, ఆ దిశగా ప్రయోగాలైతే జరుగుతూనే వున్నాయి.
సవాళ్ళున్నాయ్.. కానీ..
మనిషి తలచుకుంటే, సాధ్యం కానిది ఏదీ వుండదని అంటుంటాం. కానీ, కాలచక్రాన్ని ఏదో ఒక రోజు కాస్సేపయినా ఆపగలం.. అనే ఆశ మనిషికి వుంది. ఇప్పటికైతే, అది చేయలేకపోయాం.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతేనా.? అంటే, అవుననిగానీ.. కాదనిగానీ ఖచ్చితంగా చెప్పలేం. ఇదో సందిగ్ధ పరిస్థితి.
అది మన వినాశనానికే దారి తీస్తుందన్న భయాల నేపథ్యంలో, ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతానికి అందని ద్రాక్షగానే చెప్పుకోవాల్సి వుంటుంది.
Also Read: అనాస.. అపోహ.! అసలు పైనాపిల్ కథేంటి.?
మానవ పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు చూశాం. వేల ఏళ్ళుగా జరుగుతున్న మార్పులకి.. గడచిన కొన్ని దశాబ్దాల్లో జరుగుతున్న మార్పులకీ అనూహ్యమైన తేడా వుంది.
మరీ ముఖ్యంగా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని, అస్సలు ఊహకే అందని అనేక మార్పుల్ని మనం చూస్తున్నాం.
ఈ లెక్కన, ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా త్వరలోనే.. అతి త్వరలోనే సాధ్యమవుతుందేమో.!
– Inputs By JdotD