ఒకప్పుడు సినిమాల నిడివి ఎక్కువగా వుండేది. దాన్ని కత్తిరించుకుంటూ వచ్చేశాం. ఓటీటీ కంటెంట్.. షార్ట్ ఫిలింస్.. ఈ ట్రెండ్ పుణ్యమా అని, ఎక్కువ సేపు ఓ సినిమాకి అతుక్కుపోవడాన్ని చాలామంది ప్రేక్షకులు ఇష్టపడటంలేదు. ఇంకోపక్క, కాస్త నిడివి ఎక్కువైతే అస్సలు ప్రేక్షకులు ఆ సినిమా పట్ల ఆసక్తి చూపడంలేదు.. అది ఎంత ప్రతిష్టాత్మకమైన సినిమా (Allu Arjun Pushpa and RRR Movie To Release In Two Parts) అయినాసరే.
ఇక, రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ రెండు పార్టులుగా విడుదలైన విషయం విదితమే. ఒకటి ‘బాహుబలి ది బిగినింగ్’ (Baahubali The Begining) అయితే, ఇంకోటి ‘బాహుబలి ది కంక్లూజన్’ (Baahubali The Conclusion). ముందు ఓ సినిమానే అనుకున్నారు.. ఆ తర్వాత సీన్ మారింది. రెండు పార్టులూ ఘనవిజయాన్ని అందుకున్నాయి.
అయితే, ‘ఎన్టీయార్’ బయోపిక్ (NTR Biopic) విషయంలో మాత్రం తేడా కొట్టేసింది. ‘ఎన్టీయార్ కథానాయకుడు’ (NTR Kathanayakudu), ‘ఎన్టీయార్ మహానాయకుడు’ (NTR Mahanayakudu) అంటూ రెండు పార్టులుగా సినిమా తీస్తే, ఆ రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. తండ్రి మీద ప్రేమతో నందమూరి బాలకృష్ణ చేసిన ప్రయోగమిలా వికటించింది.
నిజానికి, అంతకు ముందు ‘రక్తచరిత్ర’ (Rakta Charitra) సినిమాని రెండు పార్టులుగా తీర్చిదిద్దాడు వర్మ (Ram Gopal Varma). ఆ రెండిట్లో మొదటిది ఫర్వాలేదు.. రెండోది అడ్రస్ గల్లంతయ్యింది.
ప్రస్తుతం రెండు భారీ చిత్రాలపై ‘రెండు పార్టులు’ అన్న చర్చ జరుగుతోంది. అందులో ఒకటి ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో రష్మిక మండన్న (Rashmika Mandanna) హీరోయిన్. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్ కిందా మీదా అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాతలు, సినిమాని రెండు భాగాలుగా చేసి రిలీజ్ (Allu Arjun Pushpa To Release In Two Parts) చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అదనంగా ఓ పాటని కూడా అతికించబోతున్నారట.
జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) కూడా ఇదే బాటలో పయనిస్తుండొచ్చు. పైగా, రాజమౌళి గతంలో ఇలా రెండు పార్టుల సినిమాని తెరకెక్కించి, విడుదల చేసి హిట్టు కొట్టాడాయె. ఆ ‘బాహుబలి’ అనుభవంతో, రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ (Allu Arjun Pushpa and RRR Movie To Release In Two Parts) సినిమాపై త్వరలో రెండో నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
