Pushpa స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా ఐకాన్ స్టార్ (Allu Arjun) అయ్యాడు.. కానీ, పుష్ప రాజ్.. అంటూ చిత్ర విచిత్రమైన ‘గెటప్పు’లో అల్లు అర్జున్ కనిపించేలా సుకుమార్ మార్చేశాడు. అల్లు అర్జున్ ఒక్కడే కాదు, ఫహాద్ ఫాజిల్ అలాగే ఇతర ముఖ్యమైన పాత్రలన్నీ దేనికదే భిన్నమైనది.
రష్మిక మండన్న (Rashmika Mandanna), సునీల్, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).. ‘పుష్ప’ సినిమా నుంచి ఇలా ఒక్కో పాత్ర గురించీ సుకుమార్ అండ్ టీమ్ పరిచయం చేస్తున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
Pushpa నెవర్ బిఫోర్ అంతే..
ఏ గెటప్ చూసినా, ‘నెవర్ బిఫోర్..’ అనే అభిప్రాయమే కలగుతోందంటే, సినిమాలోని పాత్రల కోసం దర్శకుడు ఏ స్థాయిలో కసరత్తులు చేసి వుంటాడో అర్థం చేసుకోవచ్చు. ఏ నటుడు లేదా నటి.. ఇంతకు ముందు ఇలాంటి పాత్రల్లో కనిపించలేదన్నది నిర్వివాదాంశం. ముందు ముందు మళ్ళీ అలాంటి పాత్రలు వాళ్ళకి దక్కుతాయో లేదో చెప్పలేం.

‘పుష్ప’ సినిమాని రెండు పార్టులగా విడుదల చేయనున్న విషయం విదితమే. తొలి భాగం, ‘పుష్ప ది రైజ్’ (Pushpa The Rise) పేరుతో ఈ డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read: Beauty Tips: అందంగా.. మీకు మీరే సొంతంగా.!
పుష్పరాజ్ (Pushpa Raj) పాత్రలో అల్లు అర్జున్, శ్రీవల్లి పాత్రలో రష్మిక మండన్న (Srivalli), మంగళం శ్రీను (Mangalam Srinu) పాత్రలో సునీల్, దాక్షాయని (Dakshayani) పాత్రలో అనసూయ భరద్వాజ్.. ఇలా ప్రతి పాత్రకీ తనదైన ప్రత్యేకతను ‘మేకోవర్’ పరంగా అద్దుతున్న దర్శకుడు సుకుమార్, ఇంకెన్ని అద్భుతాలు సినిమాలో చేశాడో తెలియాలంటే, ‘పుష్ప’ విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.