Pooja Hegde.. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ సినిమాలొచ్చాయి పూజా హెగ్దే నుంచి.
తెలుగులో ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’.. తమిళంలో ‘బీస్ట్’.. ఇలా మూడు ఫ్లాపులు రావడంతో పూజా హెగ్దేని వున్నపళంగా ఐరన్ లెగ్ అనేస్తున్నారంతా.!
పూజా హెగ్దే అనగానే ముందుగా ఆమె ‘కాళ్ళ చుట్టూ’ దర్శకులు, కెమెరామెన్లు చూడటం, ఆ కాళ్ళని చూపించేందుకు తాపత్రయ పడటం తెలిసిన వ్యవహారమే.
ఒకప్పుడు అవి గోల్డెన్ లెగ్స్.. ఇప్పుడేమో ఐరన్ లెగ్స్ అయిపోయాయ్.!
Pooja Hegde.. తప్పంతా ఆమెదేనా.?
‘రాధేశ్యామ్’ సినిమాలో పూజా హెగ్దే పాత్రని తీర్చిదిద్దిన దర్శకుడు, ‘బీస్ట్’ సినిమాలో పూజా హెగ్దేని చూపించిన దర్శకుడు, ‘ఆచార్య’ సినిమాలో ఆమెను ప్రెజెంట్ చేసిన దర్శకులు.. వీళ్ళది కదా తప్పు.? అన్న ప్రశ్న బుట్టబొమ్మ అభిమానుల నుంచి దూసుకొస్తోంది.
ఔను మరి, పూజా హెగ్దే నటించిన సినిమా హిట్టయినప్పుడు.. ఆమెది గోల్డెన్ లెగ్ అయితే, ఆమె నుంచి వరుస ఫ్లాపులొచ్చినప్పుడు ఐరన్ లెగ్ అయిపోతుంది కదా.?

సినిమా అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, గ్రామర్ కూడా.! ఆ గ్రామర్ అనేది సెంటిమెంట్ పరంగానూ సరిగ్గా వుండాలి మరి.!
జాగ్రత్త పడకపోతే కష్టమే సుమీ.!
అన్నట్టు, పూజా హెగ్దే చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలున్నాయి. సౌత్ సినిమాలే కాదు, బాలీవుడ్ సినిమాలూ వున్నాయి. సో, పూజా హెగ్దే కెరీర్‌కి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమైతే ఏమీ లేదు.
Also Read: పొట్టి డ్రస్సు.. అనసూయ కస్సు బుస్సు
కానీ, కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం.. బుట్టబొమ్మ స్టార్‌డమ్.. చెత్త బుట్టలోకి వెళ్ళిపోవచ్చన్నది సర్వత్రా వినిపిస్తోన్న అభిప్రాయం.