Pushpa The Rise.. అభిమానులకి కోపమొస్తే ఇంకేమన్నా వుందా.? తమ అభిమాన హీరో సినిమాని నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థపై విరుచుకుపడిపోతారు. అల్లు అర్జున్ అభిమానులు ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివేశారు. అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ తొలి పార్ట్ ‘పుష్ప ది రైజ్’ విడుదలకు సిద్ధమయిన దరిమిలా, ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు, చిత్ర నిర్మాణ సంస్థ ఒకింత ఝలక్ ఇచ్చింది.
సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ విడుదల అనుకున్న సమయానికి జరగలేదు. దాంతో, అభిమానులు గుస్సా అయ్యారు. చిత్ర నిర్మాణ సంస్థ మీద తిట్ల దండకం అందేసుకున్నారు. అసలు వస్తుందా.? రాదా.? అని కొందరు అల్లు అర్జున్ అభిమానులు అసహనంతో విరుచుకుపడిపోయారు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద.
ఎట్టకేలకు Pushpa The Rise Trailer వచ్చేసిందిగానీ..
ఎట్టకేలకు ‘పుష్ప ది రైజ్’(Pushpa) ట్రైలర్ వచ్చేసింది. దాంతో, అభిమానులు కాస్త శాంతించారు. అయితే, ‘ఈమాత్రం దానికి ఇంత పబ్లిసిటీ స్టంట్ అవసరమా.?’ అని అభిమానులు ప్రశ్నిస్తున్నారంటే, ట్రైలర్ వారిని అంతలా మెప్పించలేదనే కదా అర్థం.?
సుకుమార్ (Director Sukumar), అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) కాంబినేషన్ నుంచి అభిమానులు చాలా ఆశించారు. పైగా, ఇది పాన్ ఇండియా సినిమా. దాంతో, అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటేశాయి. ట్రైలర్ మాత్రం ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. అలాగని, ట్రైలర్ అస్సలు బాగాలేదని కాదు. విజువల్స్ అదిరిపోయాయి.

చాలా చాలా స్పెషల్..
అల్లు అర్జున్ డిక్షన్ కెవ్వు కేక. రష్మిక మండన్న (Rashmika Mandanna) చాలా స్పెషల్‌గా కనిపిస్తోంది. అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ (Sunil), ఫహాద్.. ఇలా ప్రతి ఒక్కరూ చాలా చాలా కొత్తగా కనిపిస్తున్నారు ‘పుష్ప’లో. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దగ్గర్నుంచి, యాక్షన్ ఎపిసోడ్స్ వరకు.. అన్నీ సినిమాపై అంచనాల్ని పెంచేలానే వున్నాయి. అయినాగానీ, ఏదో వెలితి అభిమానుల్ని వేధిస్తోంది.
పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా.? ఫైరు.. అంటూ అల్లు అర్జున్ (Icon StAAr Allu Arjun) చెప్పే డైలాగ్.. దాంతోపాటుగా, పార్టీ ఎప్పుడు.? అంటూ ఫహాద్ ప్రశ్నించడం.. ఇవన్నీ ట్రైలర్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్ళిపోయాయ్.
Also Read: Samantha Ruth Prabhu, తప్పొప్పుల పంచాయితీ
అందుకే, వ్యూస్ పోటెత్తుతున్నాయ్.. లైకులు వెల్లవలా వచ్చిపడుతున్నాయి ‘పుష్ప’ (Pushpa The Rise Trailer) ట్రైలర్‌కి. మరి, సినిమా మాటేమిటి.? చాలా వుంటాయ్.. ఎందుకంటే, సుకుమార్ – బన్నీ (Allu Arjun) కాంబోలో వస్తోన్న పాన్ ఇండియా సినిమా ఇది.
