Pushpa The Rule Begins.. ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్, ‘పుష్ప ది రైజ్’ సినిమాతో దేశం దృష్టిని ఆకర్షించాడు. ‘పాన్ ఇండియా’ స్థాయిలో ‘పుష్ప’ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఈ నేపథ్యంలోనే, ‘పుష్ప ది రూల్’ని మరింత భారీ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. అల్లు అర్జున్ పుట్టినరోజు నేపథ్యంలో, ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ, ఓ వీడియో వదిలారు.!
‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అన్న స్థాయిలో ‘వేర్ ఈజ్ పుష్ప’తో ఉత్కంఠ రేకెత్తించాలనుకున్నారుగానీ, అది కాస్తా తుస్సుమంది.!
Pushpa The Rule Begins.. ఏదీ ఆ స్పష్టత.?
సుకుమార్ (Director Sukumar) ఏదో చెప్పాలనుకున్నాడు.! అల్లు అర్జున్ ఏదో చేశాననుకున్నాడు.! చీకట్లో ‘ట్రాకింగ్ కెమెరాల్లో’ నమోదైనట్లుగా కొన్ని విజువల్స్ చూపించారు.
పులికంటే శక్తివంతుడు పుష్ప.. అని చెప్పాలన్నది ‘పుష్ప’ (Pushpa Movie) మేకర్స్ ఉద్దేశ్యం కావొచ్చు. చివర్లో సర్‌ప్రైజ్ అదిరిపోయింది.!
కానీ, ‘వేర్ ఈజ్ పుష్ప’ (Where Is Pushpa) అన్న అంశం చుట్టూ నడిపిన డ్రామానే, అస్సలు స్పష్టత లేకుండా పోయింది.
ఏం చేశాడు పుష్ప ఆ సంపాదనని.?
ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప రాజ్, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు.. ఇలా ఏవేవో కట్టేశాడట. అదీ సుకుమార్ ‘సార్’ ఈ ప్రమోషనల్ వీడియోలో చెప్పిన విషయం.
అంటే, వున్నపళంగా పుష్ప రాజ్ సంఘ సంస్కర్త అయిపోయాడన్నమాట. లెక్కల మాస్టారు సుకుమార్, ‘పుష్ప ది రూల్’తో సమాజానికి ‘సక్కటి’ మెసేజ్ ఇచ్చేయబోతున్నాడని మనం అనుకోవాలి.
Also Read: ‘రావణాసుర’ ఇన్‌సైడ్ రిపోర్ట్.! బాక్సాఫీస్ ‘ధమాకా’యేనా.?
‘పుష్ప ది రైజ్’లో హీరో పుష్ప రాజ్.. ఒక్కటీ సక్కగ చేయడు. రెండో పార్ట్‌లో మాత్రం అన్నీ సక్కగ చేసేస్తాడన్నమాట. అంటే, ఇక్కడ పుష్ప రాజ్ మంచి బాలుడని అనుకోవాలంతే.

క్లారిటీ దొరకట్లేదు పుష్పా.. (Pushpa Raj Allu Arjun) అలా ఎలా మారిపోయావ్.?
అన్నట్టు, ‘పుష్ప ది రూల్’ నుంచి రివీల్ చేసిన పోస్టర్‌లో మాత్రం, అల్లు అర్జున్ లుక్ వేరే లెవల్‌లో వుంది.! నెవర్ బిఫోర్ అనడం అతిశయోక్తి కాదు.
నిజానికి, ఇలాంటి లుక్‌కి ఓకే చెప్పినందుకు అల్లు అర్జున్‌ని (Icon Star Allu Arjun) అభినందించి తీరాల్సిందే.