Table of Contents
గత సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త సినిమాపై ఆకాశాన్నంటే అంచనాల్ని పొందడమే ‘సూపర్’ స్టార్‌డమ్. ఆ స్టార్‌డమ్ సూపర్‌స్టార్ సొంతం. పరిచయం అక్కర్లేని ఆ సూపర్‌స్టార్ ఇంకెవరో కాదు, ‘మహేష్‌బాబు’ (Maharshi Review Maheshbabu Pooja Hegde).
‘మ..హే..ష్’ ఆ పేరులోనే వైబ్రేషన్స్ కనిపిస్తాయి చాలా మందికి. అమ్మాయిల కలల రాకుమారుడు. బాక్సాఫీస్‌కి వసూళ్ల రారాజు.. ‘మహర్షి’ సినిమాతో మరో మారు వసూళ్లు కొల్లగొట్టడానికి వచ్చేస్తున్నాడు.
మే 9 సూపర్ స్టార్ అభిమానులకు అసలు సిసలు పండగ. ఆ రోజే ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా కథా కమామిషు ఏంటీ.? అభిమానుల అంచనాలేంటీ.? తదితర వివరాల్లోకి వెళ్లిపోదాం.
స్టైలిష్ మేకింగ్ కి కేరాఫ్ అడ్రస్ వంశీ.. (Maharshi Preview)
వంశీ పైడిపల్లి పేరు చెప్పగానే స్టైలిష్ ఫిలిం మేకర్ కళ్ల ముందు మెదులుతాడు. అతని సినిమాలో యాక్షన్ ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది. రిచ్‌నెస్ ఉంటుంది. వాట్ నాట్.. అన్నీ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కంప్లీట్ ప్యాకేజ్ అనదగ్గ సినిమాల్ని రూపొందించడంలో వంశీ దిట్ట.
‘బృందావనం’, ఎవడు’, ‘ఊపిరి’ తదితర హిట్ సినిమాలు కళ్ల ముందు మెదులుతాయి వంశీ పైడిపల్లి పేరు చెప్పగానే. ఈ స్టైలిష్ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేష్‌తో జత కట్టడమంటేనే ‘హిట్టుబొమ్మ’కన్‌ఫామ్ అయిపోయినట్లే.
క్వాలిటీ విషయంలో మహేష్, వంశీ ఇద్దరూ ఇద్దరే. ఆ విషయం ప్రోమోస్ చూస్తేనే అర్ధమవుతుంది. సో ప్రోమోస్‌తోనే ఈ స్టైలిష్ డైరెక్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పదింతలు చేసేశాడన్నమాట.
అగ్ర నిర్మాతలు ఒక్కటయ్యారు (Maharshi Preview)
న భూతో న భవిష్యతి అనే స్థాయిలో సినిమా ఉండాలని అనుకున్నారో ఏమో, అగ్ర నిర్మాతలు చేతులు కలిపారు. దిల్ రాజు, అశ్వనీదత్. పీవీపీ.. ఇలా పెద్ద తలకాయలు పెద్ద చిత్రం బాధ్యతను తీసుకున్నారు.
ఇంకేం మ్యాగ్నమ్ ఓపస్ అనే స్థాయి ‘మహర్షి’కి (Maharshi Preview) వచ్చేసింది. సంచలనం అనేది చిన్న మాటైపోయిందిక్కడ. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతీ ప్రోమోలోనూ రిచ్‌నెస్ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. స్టైలిష్ మేకింగ్‌కి తగ్గట్లుగా రిచ్ వేల్యూస్‌ని నిర్మాతలు అద్దారు.
ఇకనేం, వెండితెర అద్భుతానికి అన్నీ కుదిరినట్లే కదా.
అందగాడితో అందాల భామ (Maharshi Preview)
ఇప్పటికీ 20 ఏళ్ల కుర్రాడిగానే కనిపిస్తాడు మహేష్. మహేష్ అందాన్ని మ్యాచ్ చేయాలంటే అటు వైపు హీరోయిన్ కూడా ఆ రేంజ్ అందగత్తె అయ్యి ఉండాలి. అందుకేనేమో ఏరి కోరి పూజా హెగ్దేని తీసుకొచ్చారు.
మహేష్ సరసన పూజా హెగ్దే పర్‌ఫెక్ట్‌గా సూటయ్యింది. ఒక్కో స్టిల్ వీరిద్దరి కెమిస్ట్రీని ఓ రేంజ్‌లో చూపిస్తోంది. వీడియో ప్రోమోస్ అయితే కేక పుట్టిస్తున్నాయి.
మహేష్ – పూజా హెగ్దేతో పాటు, అల్లరి నరేష్ ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర చాలా కీలకం కాబోతోంది.
రాక్ స్టార్ అదరగొట్టేశారు.!
ఆడియో సింగిల్స్ రూపంలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పాటలన్నీ బయటికొచ్చేశాయి. ఒకదాన్ని మించిన పాట ఇంకోటి అన్నట్లు అన్ని పాటలూ ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్‌గా ఆల్రెడీ ప్రశంసలు అందుకుంటోంది ‘మహర్షి’ (Maharshi Review Maheshbabu Pooja Hegde) ఆడియో.
రాక్ స్టార్ దేవిశ్రీ – సూపర్‌స్టార్ మహేష్ కాంబినేషన్ అంటే మ్యూజికల్‌గా అదో అద్భుతం అంతే. పైగా వంశీ, దేవిశ్రీ కాంబో కూడా సక్సెస్‌ఫుల్ అనే చెప్పాలి.
రికార్డులు ఎదురు చూస్తున్నాయి. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి బాక్సాఫీస్ మైండ్ బ్లాంక్ అయిపోతుందో, ఆడే మహేష్.. అని సూపర్‌స్టార్ అభిమానులు అంటుంటారు. అది నిజం కూడా. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ ‘మహర్షి’ కోసం ఎదురు చూస్తోంది.
చాలా రికార్డులు మహేష్ కోసం ఎదురు చూస్తున్నాయి. నాన్ బాహుబలి రికార్డులు గల్లంతైపోవడమనేది జస్ట్ ఓ మోస్తరు పోజిటివ్ టాక్‌తోనే సాధ్యమవ్వచ్చు. ప్రీ రిలీజ్ బజ్ అదిరిపోయే రేంజ్‌లో ఉంది. అదే టాక్ రిలీజ్ రోజు కూడా వినిపిస్తే, మహేష్ సృష్టించబోయే ప్రభంజనానికి ఆకాశమే హద్దు.
ఓవర్సీస్ మొనగాడు (Maharshi Preview)
ఓవర్సీస్ మార్కెట్‌లో మహేష్‌కి ఉన్న సానుకూలతలు అన్నీ ఇన్నీ కావు. మాంచి ట్రాక్ రికార్డు ఉంది మహేష్‌కి. ఫ్లాప్ సినిమాలు కూడా బంపర్ వసూళ్లు సాధిస్తాయక్కడ. హిట్టుబొమ్మ పడిందంటే ఓవర్సీస్‌లో సూపర్ కుమ్ముడే.
మహేష్ అభిమానులే కాదు, మొత్తంగా తెలుగు సినీ ప్రేక్షకులు ఏమహర్షి’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ బంపర్ విక్టరీ కోసం ఎదురు చూస్తోంది. రికార్డుల సంగతి సరేసరి.. ఇన్ని ఎదురు చూపులకు మహేష్ ‘మహర్షి’తో (Maharshi Preview) సూపర్బ్ సమాధానం చెప్పాలని ఆశిద్దాం.