Table of Contents
R Narayana Murthy HHVM.. ఆర్ నారాయణ మూర్తి తెలుసు కదా.? ‘ఎర్ర’ సినిమాల స్పెషలిస్టు.!
తనే నటించి, తనే నిర్మించి, తనే దర్శకత్వం కూడా వహించి.. సినిమాల్ని విడుదల చేసేయగల మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఆర్ నారాయణ మూర్తి.
ఎగ్జిబిటర్లు, పర్సంటేజీ.. ఈ వివాదంపై ఆర్ నారాయణ మూర్తి కూడా ‘సీనియర్ ఫిలిం పర్సనాలిటీ’గా తన అభిప్రాయాల్ని చెప్పే హక్కు వుంది.
కాకపోతే, ఆర్ నారాయణ మూర్తి ఎందుకు ‘హరి హర వీర మల్లు’ ప్రస్తావన తీసుకొస్తూ, ప్రెస్ మీట్ పెట్టినటల్లు.? అంతలా ఆయనకు ఏ ‘ముల్లు’ గుచ్చేసుకుంది.?
గద్దర్ అవార్డులపై స్పందన..
తెలంగాణ ప్రభుత్వం, సినీ రంగానికి ఇటీవల అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘గద్దర్’ పేరుతో ఈ అవార్డుల్ని ప్రకటించారు.
తెలుగు సినిమాకి ఇలాంటి అవార్డులు ప్రోత్సాహకంగా వుంటాయి. ఔత్సాహిక నటీనటులు, దర్శక నిర్మాతలు.. ఇలా అందరికీ ఇవి ఎంకరేజింగ్‌గా వుంటాయన్నది తెలిసిన విషయమే.
గద్దర్ అవార్డుల నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులు ఇవ్వాలని ఆర్ నారాయణ మూర్తి కోరారు.
R Narayana Murthy HHVM.. ‘హరి హర వీర మల్లు’ మీద ఎందుకీ ఏడుపు.?
ఇక్కడి వరకూ, ఆర్ నారాయణ మూర్తిని తప్పు పట్టడానికేమీ లేదు. కాకపోతే, ‘హరి హర వీర మల్లు’ ప్రస్తావన తెచ్చి, ఇదంతా పెయిడ్ ప్రెస్ మీట్.. అనే భావన కల్పించారాయన.
జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్.. అని, అన్ని మీడియా సంస్థల్లోనూ కొన్నాళ్ళ క్రితం బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఛాంబర్.. ఇలా అన్నిటి మధ్యా పంచాయితీ ఇది.
Also Read: ప్రభాస్ ‘స్పిరిట్’ హీరోయిన్ తృప్తి.! ఈ మార్పు ఊహించిందే.!
‘హరి హర వీర మల్లు’ సినిమా రిలీజ్ జూన్ 12 కాగా, జూన్ 1 నుంచి థియేటర్ల బంద్.. అనగానే, సహజంగానే కొన్ని అనుమానాలు తెరపైకొస్తాయ్.
ఆ అనుమానాల నేపథ్యంలోనే, అసలు బంద్‌కి కుట్ర పన్నింది ఎవరు.? అన్న ప్రశ్నకు సమాధానం తేల్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ షురూ చేసింది.
సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
మరోపక్క, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా, పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రిని కలవలేదన్న అభిప్రాయాన్నీ పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన ఇదీ..
సినీ పరిశ్రమలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం, ఆయా వ్యక్తులు కాకుండా, పరిశ్రమ తరఫున అధికారికంగా ముఖ్యమంత్రిని కలవాలన్నది డిప్యూటీ సీఎం అభిప్రాయం.
ఇందులో తప్పేముంది.? పైగా, ఇది తెలుగు సినీ పరిశ్రమకి మేలు చేస్తుంది కదా.? ఇంకా నయ్యం.. అంతటి ఇంగితం సినీ జనాలకు వుంటే.. ఇన్ని అనర్ధాలెందుకు జరుగుతాయి.?
ఆర్ నారాయణ మూర్తి అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అద్గదీ అసలు సంగతి. ఈ రోజు ఆర్ నారాయణ మూర్తి ప్రెస్ మీట్ ప్రదర్శించిన హడావిడి, వెనుక వైసీపీ హస్తం సుస్పష్టం.
వైసీపీకి ముల్లు గుచ్చుకుంటుందేమోనని, ఆర్ నారాయణ మూర్తి.. ఇలా మీడియా ముందుకొచ్చారన్నమాట. అయినా, సినీ పరిశ్రమకీ వైసీపీకీ ఏంటి సంబంధం మూర్తీ.?
కొండని చూసి కుక్కలు మొరిగితే, కొండకి చేటా.? ఈ సామెత ఓ సారి గుర్తు చేయాలనిపించిందంతే.!