Raashi Khanna.. ఓ వైపు సినిమాలు.. ఇంకో వైపు వెబ్ సిరీస్‌లతో అందాల భామ రాశీ ఖన్నా బిజీ బిజీగా వుంది.
తెలుగుతోపాటు, తమిళ సినిమాలు అలాగే హిందీ సినిమాలూ చేసేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
రాశి ఖన్నా – విజయ్ దేవరకొండ కలిసి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Raashi Khanna.. ఫ్లాపయినా.. హిట్టేనంటోంది..
‘వరల్డ్ పేమస్ లవర్’ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయినా, అది హిట్టు సినిమాయేనంటోంది రాశి ఖన్నా. పైగా, అది తనకు బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటని చెప్పుకొచ్చింది.
సినిమాలతో పోల్చితే.. వెబ్ సిరీస్‌లలో నటనా ప్రతిభ చాటుకోవడానికి ఇంకాస్త ఎక్కువ స్కోప్ లభిస్తోంది.. బహుశా స్క్రీన్ స్పేస్ ఎక్కువ వుండడం వల్లేనేమో.!
Raashi Khanna
‘విజయ్ దేవరకొండ వెరీ వెరీ స్పెషల్.! ఆయనతో స్నేహం గొప్పది. మేమిద్దరం కలిసి ఇంకోసారి పని చేయాలని వుంది..’ అంటూ రాశి ఖన్నా తాజాగా తన మనసులో మాటని బయటపెట్టింది.

‘నార్త్‌లో కూడా విజయ్ దేవరకొండకి అనూహ్యమైన ఫాలోయింగ్ వుంది. తెరపై ఆయన ఆటిట్యూడ్‌కి యువత ఫిదా అవుతుంటారు..’ అని చెప్పింది రాశి ఖన్నా.
సినిమాల్నీ, వెబ్ సిరీస్‌లనీ వేరు చేసి చూడలేమంటున్న రాశి ఖన్నా, అక్కడా.. ఇక్కడా నటన పరంగా పెద్దగా మార్పులేమీ వుండబోవని అభిప్రాయపడింది.
Also Read: ‘భీమ్లానాయక్’ మొదటిది కాదు, మూడోది: సంయుక్త.!
వెబ్ సిరీస్‌ల ట్రెండ్ మంచిదేననీ, వెండితెరపై చెప్పలేని కొన్ని మంచి మంచి కథల్ని ఓటీటీ వేదికగా జెన్యూన్‌గా చెప్పడానికి వీలవుతోందని అంటోంది ఈ అందాల భామ.
‘ఫర్జీ’ తదితర వెబ్ సిరీస్‌లలో నటించి, వెబ్ సిరీస్‌లతోనూ నటిగా తానేంటో నిరూపించుకుంటోంది రాశి ఖన్నా. వెబ్ సిరీస్ అంటే ఒకప్పుడు ‘బూతు’ అనే భావన వుందనీ, ఇప్పుడా అపోహ చెరిగిపోయిందన్నది రాశి ఖన్నా చెబుతున్నమాట.