Table of Contents
Radhe Shyam Pre Review: సాధారణంగా ప్రేమ కథా చిత్రాలంటే ఓ మోస్తరు బడ్జెట్టుతో మాత్రమే తెరకెక్కుతాయ్. అందమైన లొకేషన్లలో సినిమా చిత్రీకరించేందుకు అయ్యే ఖర్చు, నటీనటుల రెమ్యునరేషన్.. ఇలా ఎలా చూసుకున్నా, బడ్జెట్ పెద్దగా పెట్టరు ప్రేమ కథా చిత్రాలకి.
కానీ, పాన్ ఇండియా ‘డార్లింగ్’ ప్రభాస్ (Darling Prabhas) హీరోగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ కథ వేరు. ఇది ప్రేమ కథా చిత్రమే.! కానీ, హాలీవుడ్ యాక్షన్ సినిమాకి ధీటుగా ఈ సినిమా కోసం ఖర్చు చేశారు. 350 కోట్లు ఖర్చయ్యిందని స్వయంగా హీరో ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో ‘రాధేశ్యామ్’ గురించి చెప్పిన సంగతి తెలిసిందే.
Radhe Shyam Pre Review అంత ఖర్చు చేశారా.? దేనికోసం.!
అంతలా ‘రాధేశ్యామ్’ సినిమాలో ఖర్చు చేయడానికేముంది.? అంటే, అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సినిమా ప్రోమోస్‌లో రిచ్‌నెస్ చూస్తే, ఎవరైనాసరే, ‘వావ్’ అనాల్సిందే. ‘సాహో’ సినిమా కోసం కూడా ఇలాగే ఖర్చుపెట్టారు.. అయితే, అది యాక్షన్ సినిమా.!

ప్రేమ కథా చిత్రాల్లో ‘రాధేశ్యామ్’ అత్యంత ఖరీదైనదిగా చెప్పుకోవాలేమో.! ప్రభాస్, పూజా హెగ్దే మాత్రమే కాదు, ఈ సినిమాలో నటించిన నటీనటులు, సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లు.. అంతా ఓ యజ్ఞం చేసేశారనడం అతిశయోక్తి కాకపోవచ్చు.
Radhe Shyam Pre Review ట్రోల్స్ బారిన పడ్డ ‘రాధేశ్యామ్’
‘రాధేశ్యామ్’ సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు, చిత్ర నిర్మాణ సంస్థ ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘సినిమా ఇంకెప్పుడు.?’ అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడానికే చాలా చాలా ఇబ్బంది పడ్డారు.
కోవిడ్ సమస్య తలెత్తడం, దానికి తోడు ఇతరత్రా సమస్యలు.. వెరసి, ‘రాధేశ్యామ్’ అనే యజ్ఞానికి చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. వాటన్నిటినీ దాటుకుని సినిమాని థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
సినిమా సత్తా ఎంత.?
అంతా బాగానే వుందిగానీ, బాక్సాఫీస్ వద్ద ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) సినిమా సత్తా ఎంత.? పాన్ ఇండియా సినిమా గనుక, ఆయా భాషల్లో ‘రాధేశ్యామ్’ చేయబోయే హంగామా ఎంత.? ఈ ప్రశ్నలకు చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఓ ఇంటర్వ్యూలో సమాధానమిస్తూ, ‘అంచనాల్ని మించి వుంటుంది’ అని అన్నాడు.

ఇదిలా వుంటే, సినిమా కోసం ఇటలీలోని అందమైన దృశ్యాల్ని.. అవి కూడా, చాలా ఏళ్ళ క్రితం నాటి పరిస్థితుల్ని రీ-క్రియేట్ చేశారు. ఆర్ట్ డిపార్టుమెంట్‌కి ఇదొక అగ్ని పరీక్షే. కానీ, ఆ పరీక్షలో డిస్టింక్షన్‌లో సినిమా పాస్ అయినట్లే కనిపిస్తోంది.
ప్రభాస్ – పూజా హెగ్దే.. ఈ కాంబినేషన్ వెరీ స్పెషల్
పూజా హెగ్దే – ప్రభాస్ (Pooja Hegde Prabhas) కాంబినేషన్ తెరపై చూడచక్కగా వుంటుందని ప్రత్యేకంగా చెప్పాలా.? అయితే, సినిమా నిర్మాణ సమయంలో ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు వచ్చాయనే ప్రచారం షురూ అయ్యింది.
Also Read: Bheemla Nayak.. సునీల్.. ఎంత నేరం చేసేశావయ్యా.?
ఆ ప్రచారం సినిమా రిలీజ్ ముందు వరకూ కొనసాగడం.. ప్రభాస్ (Prabhas), పూజా హెగ్దే.. (Pooja Hegde) ఇద్దరూ ఈ ప్రచారాన్ని ఖండించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.