రాధేశ్యామ్ ట్రైలర్ రివ్యూ.. ‘టైటానిక్’ సినిమా తరహాలో అత్యద్భుతమైన ప్రేమకథని ‘రాధేశ్యామ్’ సినిమాలో చూడబోతున్నామా.? ‘రాధేశ్యామ్’ ట్రైలర్ విడుదలయ్యాక చాలామందిలో కలిగిన అభిప్రాయం ఇదే. ప్రభాస్, పూజా హెగ్దే జంటగా ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ (Radhe Shyam Trailer Review) సినిమా రూపొందింది.
జనవరి 14న ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ పాన్ ఇండియా సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. అభిమానుల కేరింతల నడుమ, సినిమా ట్రైలర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది.
రాధేశ్యామ్ ట్రైలర్ రివ్యూ.. హాలీవుడ్‌కి ఏమాత్రం తక్కువ కాదు.!
ట్రైలర్ మొదలయినప్పటినుంచి, ముగిసేవరకూ.. ప్రతి ఫ్రేమ్ చాలా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఒకటేమిటి.. అన్నీ టాప్ క్లాస్‌లో కనిపిస్తున్నాయి. ప్రభాస్, పూజా హెగ్దే కాంబినేషన్ చాలా ప్లెజెంట్‌గా వుంది.
హీరో హస్తసాముద్రికంలో దిట్ట. ప్రపంచస్థాయి ప్రముఖులంతా ఆయన వద్దకు వెళుతుంటారు. ఎవరి జీవితంలో ఏం జరగబోతోందో విక్రమాదిత్య (హీరో పేరు)కి తెలిసిపోతుంటుంది. మరి, అలాంటి విక్రమాదిత్య తన ప్రేమ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.? అన్నది ‘రాధేశ్యామ్’ సినిమాగా కనిపిస్తోంది.
ప్రభాస్ అంటే కేవలం రెబల్ స్టార్ కాదు.. పాన్ ఇండియా సూపర్ స్టార్. ‘బాహుబలి ది బిగినింగ్’, ‘బాహుబలి ది కంక్లూజన్’, ‘సాహో’.. ఇలా మూడు సినిమాలతో, తన రేంజ్ ఏంటో చూపించిన ప్రభాస్, ఈసారి అంతకు మించి.. అంటున్నాడు ‘రాధేశ్యామ్’ సినిమాతో.
Also Read: RRR Trailer Review.. యుద్ధాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆయుధాలివీ.!
హాలీవుడ్ సినిమాని తలపించేలా ‘రాధేశ్యామ్’ని తెరకెక్కించినట్లే అర్థమవుతోంది. కృష్ణంరాజు ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించడం గమనార్హం.
