Pragya Jaiswal Back Beauty.. ప్రకృతి అందాల్ని చూసి పరవశంలో మునిగిపోయినట్టుంది ప్రగ్యానందం.!
పేరు తెలుసు కదా.? తొలి సినిమా ‘కంచె’తో నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రగ్యా జైస్వాల్, సక్సెస్ – ఫెయిల్యూర్.. వీటికి అతీతంగా అవకాశాలు సంపాదించుకుంటోంది.

‘అఖండ’ లాంటి విజయాన్ని అందుకుంది.. అలాగే, పలు డిజాస్టర్లూ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ఖాతాలో వున్నాయ్.
ముందే చెప్పుకున్నట్లు, సక్సెస్ – ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా, కెరీర్ ముందుకు సాగిపోతోంది ప్రగ్యా జైస్వాల్‌కి.
అందం.. ఆపై అభినయం.. ఇంకాస్త లక్కు తోడైతే..
సోషల్ మీడియాలోనూ ప్రగ్యా జైస్వాల్ యాక్టివ్‌గానే వుంటోంది. చూస్తున్నారు కదా, ప్రకృతి సోయగాల్ని చూస్తూ, ఎలా పరవశించిపోతోందో.!
స్త్రీని ప్రకృతితో పోల్చుతుంటారు. ఆ లెక్కన, ఆ ప్రకృతి సోయగానికి ఏమాత్రం తీసిపోదు ప్రగ్యా జైస్వాల్ కూడా.! పొడగరి కావడం ఆమెకు అదనపు అడ్వాంటేజ్.
టైటు జీన్సు.. ఆపై స్లీవ్ లెస్ టీ-షర్ట్.. వెరసి, ప్రగ్యా జైస్వాల్ గ్లామర్‌ని రెట్టింపు చేస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో.!

కెరీర్ అలా సోసో..గా సాగిపోతోందిగానీ, అంతకు మించి రేంజ్ చూడాల్సిన స్టామినా వుంది ప్రగ్యా జైస్వాల్‌కి.! ‘అఖండ’ సీక్వెల్‌లోనూ ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.
అన్నట్టు, బాలయ్యతో ‘అఖండ’ తర్వాత, ‘డాకు మహరాజ్’ సినిమాలోనూ ప్రగ్యా జైస్వాల్ నటించిన సంగతి తెలిసిందే. ఓ సినిమాలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ కూడా చేసేసింది.