అందం పెంచుకుందామని బ్యుటీషియన్ దగ్గరకు వెళితే, ఆ ప్రయత్నం వికటించింది. అందం పెరగలేదు సరికదా, కొత్త సమస్య పుట్టుకొచ్చింది. ఇక్కడ, సమస్య ఎదుర్కొన్నది ఓ గ్లామరస్ హీరోయిన్ (Raiza Wilson Cosmotic Treatment Failure) గనుక, ఆమె తన ఆవేదనను బయటకు చెప్పుకుంది.
ఇక్కడ బాధితురాలు కోలీవుడ్ నటి రైజా విల్సన్. ఫేషియల్ కోసం వెళితే, ‘నీ అందాన్ని రెట్టింపు చేస్తా..’ అంటూ సదరు బ్యుటీషియన్ (కాస్మొటిక్ సర్జన్ అట) ఏదో సరికొత్త చికిత్స చేసిందట. ఆ డాక్టర్ పేరు భైరవి సెంథిల్. డాక్టర్ భైరవి తన అందంతో ఆటలాడుకుందనీ, తన అందాన్ని పాడు చేసిందనీ రైజా విల్సన్ వాపోయింది.
నిజానికి, చాలామంది మహిళలు ఎదుర్కొంటోన్న సమస్యే ఇది. తమను తాము అందంగా మలచుకునే క్రమంలో బ్యూటీషియన్లను, కాస్మొటిక్ సర్జన్లను యువతులు, మహిళలు ఆశ్రయించడం కొత్తేమీ కాదు. ఈ క్రమంలో కొందరు ఫేక్ బ్యుటీషియన్లు, కాస్మొటిక్ సర్జన్లు.. సదరు మహిళలపై అర్థం పర్థం లేని ప్రయోగాలు చేసి, విఫలమవుతుంటారు.

కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంటాయి కాస్మొటిక్ సర్జరీలు. ఫేషియల్ కోసం వినియోగించే క్రీములు వికటించి, దారుణమైన చర్మ సమస్యలూ ఎదుర్కొంటుంటారు. అయినా తప్పదు.. అందం పెంచుకోవాలంటే, బ్యూటీషియన్ల వెంట తిరగాల్సిందే.. కాస్మొటిక్ సర్జన్ల వెంట పడాల్సిందేనన్నట్టు కొందరు మహిళలు వ్యవహరిస్తుంటారు.
రైజా విల్సన్ విషయానికొస్తే, ఆమె న్యాయ పోరాటం చేస్తానంటోంది. డాక్టర్ భైరవి మాత్రం, ఆ చికిత్స వల్ల చిన్న చిన్న సమస్యలు వస్తాయని తాను ముందే చెప్పాననీ, అవి కొద్ది రోజులకే తగ్గిపోతాయని కూడా వివరించాననీ, అన్ని విషయాలూ ముందే చెప్పి, ఆమె ఒప్పుకున్న తర్వాతనే చికిత్స చేశానని చెబుతున్నారు.
రైజా విల్సన్ న్యాయ పోరాటం (Raiza Wilson Cosmotic Treatment Failure) చేస్తుందా.? చేస్తే ఏమవుతుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, బ్యూటీషియన్లు.. కాస్మొటిక్ సర్జన్లను నమ్మి మోసపోయిన మహిళలు వేల సంఖ్యలో.. లక్షల సంఖ్యలో వుంటారు. వారికి, న్యాయం జరిగేదెలా.?