Rajakeeyam Student Politics ఆందోళనల్లో పాల్గొంటే ఉద్యోగాలు రావు.! ఈ మాట తరచూ ప్రభుత్వాల నుంచి వినిపిస్తుంటాయి. నిజమే, ఆందోళనకారులు ఉద్యోగాలకు పనికిరారు. అది మంచిది కాదు కూడా.!
కానీ, ఆ ఉద్యోగుల్ని, మొత్తంగా ప్రభుత్వాన్ని నడపానికి మాత్రం ఆందోళనకారులు పనికొస్తారు.!
దేశంలో అగ్నిపథ్ స్కీమ్ రేపిన అలజడి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆ స్కీమ్ మంచిదా.? చెడ్డదా.? అన్నది వేరే చర్చ. హింస ఏ రూపంలో వున్నా అది సమర్థనీయం కాదు.
ప్రజాస్వామ్యంలో (Indian Democracy) విధ్వంసాలకు తావు లేదు. అసలు, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసేవాడికి అసలు దేశ భక్తి అనేదే లేనట్టు. దేశభక్తి వరకూ ఎందుకు.? అసలు వాడు మనిషే కాడు.!
రాజకీయ నాయకుడైతే ఓకేనా.?
యువత రాజకీయాల్లోకి రావాలని రాజకీయ పార్టీలు పిలుపునిస్తుంటాయి. విద్యార్థుల్లో ఎవరైతే అగ్రెసివ్‌గా వుంటారో, అలాంటివాళ్ళని ఎంచుకుని, రాజకీయ ఆందోళనల్లో ముందు వరుసలో నిలబెడుతుంటాయి.

దాదాపు అన్ని రాజకీయ పార్టీలకూ విద్యార్థి విభాగాలున్నాయ్. ఆయా రాజకీయ పార్టీలకు అవసరమైనప్పుడు, ఈ విద్యార్థి విభాగాల్నే రంగంలోకి దించుతుంటాయి. ఆ రాజకీయ పార్టీల ఆందోళనల్లో విధ్వంసాలకు పాల్పడేదీ ఈ విద్యార్థులే.
అప్పుడేమో, విద్యార్థులు రైటు.. ఆ విద్యార్థులే, తమకు అన్యాయం జరుగుతోందని రోడ్డెక్కి ఆందోళనలకు (Students and Politics) దిగితే, అప్పుడు రాంగు.!
Rajakeeyam Student Politics.. సమస్య ఇక్కడే వస్తోంది.!
తప్పు ఎక్కడైనా తప్పే.! ఒప్పు ఎక్కడైనా ఒప్పే.! పార్టీ మారినంతమాత్రాన తప్పు ఒప్పయిపోతుందా.? ఇదెక్కడి పంచాయితీ.? అసలు సమస్య ఇక్కడే వస్తోంది.
విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొంటే, భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగాలు రావు. మరి, ఆందోళల్లో పాల్గొనే రాజకీయ నాయకులకూ రాజకీయాల్లో ఉద్యోగాలు (పదవులు) దక్కకూడదు కదా.? లాజిక్కే కదా ఇది.?
ఏ రాజకీయ నాయకుడైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలడా.? చెప్పడుగాక చెప్పడు. ఎందుకంటే, తాను ఎక్కే ప్రతి మెట్టు కిందా, ఎన్నో జీవితాలు సమాధి అయిపోయి వుంటాయ్. అలా సమిధలుగా మారిన విద్యార్థుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
Also Read: నువ్వు నాశనం చేసిన మట్టి.! నిన్ను ఇంకా బతికిస్తోంది.!
రాజకీయాల్లో (Indian Politics) ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలంటే ఆందోళనలు చేయాలి, విధ్వంసాలకూ పాల్పడాలి.
ఆనక, అధికార పీఠమెక్కాక.. ఆ విధ్వంసాల్ని తప్పు పట్టాలి.. ‘ఆందోళనల్లో ఎవరన్నా పాల్గొంటే ఉద్యోగాలు రావు’ అని బెదిరించాలి. ఏం, ఎందుకు యువత, రాజకీయ నాయకుల్ని ఈ విషయంలో నిలదీయదు.?
ఇదీ నేటి రాజకీయం.! నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు వ్యవహరిస్తోంది ఈ నీఛ నికృష్ట రాజకీయం.