Rajamouli Made In India.. రాజమౌళి నుంచి ఏదన్నా సినిమా వస్తోందంటే, అది పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ సినిమానే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో తెలుగు సినిమా స్థాయినే కాదు, ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు రాజమౌళి.
అలాంటి రాజమౌళి నుంచి ఇంకో ప్రెస్టీజియస్ మూవీ రాబోతోంది. అయితే, ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు కాదు. కానీ, ఇది రాజమౌళీ ప్రోడక్టే.!
Rajamouli Made In India.. మేడిన్ ఇండియా..
మేడ్ ఇన్ ఇండియా.. మేడిన్ ఇండియా.. ఎలాగైనా అనుకోండి.! ‘మా కుర్రాళ్ళు వచ్చేస్తున్నారు..’ అంటూ, రాజమౌలి ‘మేడిన్ ఇండియా’ గురించి ప్రకటించాడు.
భారతీయ సినిమాకి సంబంధించిన సిల్వర్ స్క్రీన్ వండర్ ఇది. దీన్ని బయోపిక్‌గా చెప్పుకోవచ్చు.
ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా.. అని పేర్కొనడంలోనే, ఇండియన్ సినిమా పుట్టు పూర్వోత్తరాల గురించి ఇందులో ప్రస్తావించనున్నారనే విషయం అర్థమవుతోంది.
రాజమౌళి ఈ సినిమాకి సమర్పకుడు. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు. నితిన్ కక్కర్ ఈ ‘మేడిన్ ఇండియా’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదిలా వుంటే, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరెక్కబోయే సినిమా కోసం తెరవెనుక సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read: Devil డైలమా.! ఇదెక్కడి ప్రమోషన్ ‘సిత్రం’ చెప్మా.!
మహేష్‌బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ మూవీ కోసం ‘గ్లోబ్ ట్రోటింగ్’ అనే కాన్సెప్ట్ ఇప్పటికే ఓకే అయ్యింది.
‘గుంటూరు కారం’ సినిమా పూర్తి చేశాక, రాజమౌళి ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అవుతాడు మహేష్.