‘బేబీ’ బ్యూటీకి ఆ కళ కనిపిస్తోందిగా.!

Vaishnavi Chaitanya

Vyshnavi Chaitanya Bommarillu Bhaskar.. ‘బేబీ సినిమాతో ఊహించని విధంగా హిట్టు కొట్టింది తెలుగమ్మాయ్ వైష్ణవీ చైతన్య. డెబ్యూ మూవీకే ఆమె చేసిన పర్‌పామెన్స్ ఇండస్ర్టీలో అందర్నీ ఇంప్రెస్ చేసింది.

ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ ఇమేజ్ కోసం పాట్లు పడుతోంది వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya). త్వరలోనే ఆ కళ తీర్చుకునేలానే కనిపిస్తోంది కూడా.

ప్రస్తుతం ఆమె చేతిలో కన్‌ఫామ్ అయిన రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయ్ మరి. అందులో ఒకటి ‘డీజె టిల్లు’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ సినిమా ఒకటి.

Vyshnavi Chaitanya Bommarillu Bhaskar.. నయా జెనీలియా అవుతుందా.?

బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకుడు. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రల్ని చాలా శక్తివంతంగా డిజైన్ చేస్తుంటాడు.

తన తొలి సినిమా ‘బొమ్మరిల్లు’తోనే సీనియర్ హీరోయిన్ జెనీలియా‌కి స్టార్‌డమ్ దక్కింది. అప్పటికీ ఇప్పటికీ ఈ సినిమా ఎవ్వర్ గ్రీన్.. అందులోనూ జెనీలియా పాత్ర.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

లాంగ్ గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ నుంచి వచ్చిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలోనూ పూజా హెగ్దే పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారాయన.

తాజా సినిమా కోసం వైష్ణవీ చైతన్య పాత్ర కూడా అలాగే ప్రాధాన్యత దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు. అసలే బేబీ అలాంటిలాంటి నటి కాదాయె.

Also Read: కొత్త ఒక వింత.! ‘బ్రిక్ బిర్యానీ’ తెలుసా మీకు.?

సందివ్వాలె.. కానీ, మహానటి బిరుదును సైతం లాగేసుకోగల టాలెంట్ వుందామెకి. ఛాన్సొస్తే ఊరుకుంటుందా.! ఇరగదీసేయదూ.! చూడాలి మరి.. బేబీ ఏం చేస్తుందో.!

hellomudra

Related post