Rajamouli To Direct Balakrishna: బాలయ్యబాబుతో జక్కన్న సినిమా ఎప్పుడు.? స్వయంగా నందమూరి బాలకృష్ణ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాజమౌళినే ఈ ప్రశ్న అడిగేశాడు. ‘మీరు నాతో సినిమా తియ్యరట కదా.?’ అని బాలయ్య అడిగేసరికి రాజమౌళి కొంచెం ఇబ్బంది పడ్డాడు.!
ఆ తర్వాత ఏమయ్యిందోగానీ, బాలయ్యతో రాజమౌళి సినిమా ఖాయమయ్యిందంటూ తాజాగా ఓ గాసిప్ బయటకు వచ్చింది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించే సినిమాలో బాలయ్యకు రాజమౌళి ఓ కీలక పాత్ర ఖాయం చేశాడని.!
Rajamouli To Direct Balakrishna.. రాజమౌళి, బాలయ్య.. ఓ దబిడి దిబిడి.!
బాలయ్యా మజాకా.? బాలయ్య దెబ్బకి దిగొచ్చిన జక్కన్న.! అంటూ సోషల్ మీడియాలో చాలా సీరియస్‌గా కామెడీ డైలాగులు పేలుతున్నాయ్. ఏకంగా 40 నిమిషాల నిడివి వుండే ప్రత్యేక పాత్రని మహేష్ సినిమాలో రాజమౌళి బాలయ్య కోసం డిసైడ్ చేశాడంటూ వచ్చిన ఆ గాసిప్ చుట్టూ మరీ ఇన్ని సెటైర్లు పేలాల్సిన అవసరం వుందా.?
‘ఏయ్.! కామెడీ కాదు సీరియస్.! తేడా వస్తే దబిడి దిబిడే.!’ అంటూ బాలయ్య డైలాగుల్నే అభిమానులు సోషల్ మీడియాలో వల్లిస్తూ, నేరుగా రాజమౌళికి స్వీట్ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు.
ప్రభాస్ అలా.. బాలకృష్ణ ఇలా.!
ఏం.? బాలయ్యతో (Balayya Babu) రాజమౌళి ఎందుకు సినిమా చేయకూడదు.? బాలయ్య మంచి నటుడు.. పైగా, ‘అఖండ’ (Akhanda) సినిమాతో పెద్ద హిట్టు కొట్టేశాడు ఈ మధ్యనే.
బాలయ్య గనుక మహేష్ (Super Star Maheshbabu) సినిమాలో నటిస్తే, అది ముమ్మాటికీ మల్టీస్టారరే అవుతుంది. పైగా, ఇప్పుడు రాజమౌళి మల్టీస్టారర్ సినిమాల మీద ఫోకస్ పెట్టాడాయె.
విషయం అది కాదు, బాలయ్యబాబు (Nandamuri Balakrishna) తోపు.. రాజమౌళీ (SS Rajamouli) నీకు దమ్ముంటే ఆపు.. అన్నట్టుగా పేలుతున్న సోషల్ సెటైర్లే.!
Also Read: మనోభావాలు ఎవరివి.? ఎందుకు దెబ్బతిన్నాయ్.!
‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాలో తనకెందుకు అవకాశమివ్వలేదని ప్రభాస్ (Darling Prabhas) తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడిగేశాడు.!
దానికి సమాధానమిస్తూ ‘సినిమాలో నువ్వు చేయాల్సిన పాత్ర ఏదన్నా వుంటే, మొహమాటపడకుండా అడిగేవాడ్ని.. నేనడిగితే నువ్వు కాదని అనవు.. ఆ నమ్మకం నాకుంది..’ అని రాజమౌళి చెప్పాడంటేనే, పాత్రల విషయంలో రాజమౌళి ఎంత పక్కాగా వుంటాడో అర్థం చేసుకోవచ్చు.!