Rajinikanth Andhra Pradesh తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు.. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన వేడుకలో పాల్గొన్నారు.
అంతే, కొందరు రాజకీయ నాయకులు రజనీకాంత్‌పై (Super Star Rajinikanth) అత్యంత జగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు.!
ఓ గుట్కా పాండు అయితే, రజనీకాంత్ ‘చీకేసిన తాటికాయలా వుంటాడు’ అనేశాడు. వీడూ.. వీడి గుట్కా మొహం.. అంటూ జనం ఛీత్కరించుకుంటున్నారనుకోండి.. అది వేరే సంగతి.
Rajinikanth Andhra Pradesh.. రజనీకాంత్.. తప్పేం మాట్లాడాడని.?
టీడీపీ అధినేత చంద్రబాబుతో (Telugu Desam Party Chief Nara Chandrababu Naidu) 30 ఏళ్ళ స్నేహం నేపథ్యంలో, ‘విజనరీ’ అని మాత్రమే చంద్రబాబు మీద రజనీకాంత్ ప్రశంసలు గుప్పించారు.
ఓ వ్యక్తి, ఇంకో వ్యక్తిని పొగిడితే.. తట్టుకోలేకపోవడమనేది మూడో వ్యక్తి మానసిక దౌర్భల్యంగానే చూడాలి.!
రజనీకాంత్ ఎవర్నో పొగిడితే, ఇంకెవరికో ఎందుకు ఒళ్ళు మండిపోయింది.?
తక్షణం మానసిక వైద్య నిపుణుల్ని సంప్రదించి వైద్య చికిత్స చేయించుకోవడం మంచిది.!
తెలుగు రాజకీయాలపై తమిళ సూపర్ స్టార్ ప్రభావం వుంటుందని భయపడటమంటే, ఓడిపోతామనే గట్టి నమ్మకం వాళ్ళలో వున్నట్లే.!
రాజకీయాల్లో మానసిక రోగులెక్కువైపోయారనే సంకేతాల్ని ఈ ఉదంతం పంపుతోందంటే, అది అతిశయోక్తి కాదేమో.!
Mudra369
ఎక్కడా, ప్రభుత్వమ్మీదగానీ, అధికార పార్టీ మీదగానీ రజనీకాంత్ (Super Star Rajinikanth) విమర్శలు చేయలేదు. కానీ, అధికార పార్టీ నాయకులకు ఒళ్ళు మండిపోయింది.
సరే, స్వర్గీయ ఎన్టీయార్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, అలాంటి చంద్రబాబుని, స్వర్గీయ ఎన్టీయార్ అభిమానినని చెప్పుకునే రజనీకాంత్ ఎలా సమర్థిస్తారనీ.. వచ్చే ప్రశ్నలు.. అది మళ్ళీ వేరే చర్చ.
రాజకీయ అభద్రతాభావం.!
రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు కాదు.! సినిమాల్లోనూ రాజకీయాలున్నాయి. రాజకీయాల్లోనూ సినిమాటిక్ వ్యవహారాలున్నాయ్.
Also Read: ఆర్జీవీ నిజాలు చెబుతాడట.! నవ్వకండెహే.!
ఎవర్నన్నా ఎందుకు విమర్శిస్తున్నామో తెలియని అయోమయ.. సంకట స్థితి రాజకీయ నాయకులకు ఎందుకు వస్తోంది.?
రాజకీయం అంటేనే ఓ మత్తు.! ఆ మత్తులో జోగుతూ.. సభ్య సమాజం ఏమనుకుంటుందోనన్న విజ్ఞత మర్చిపోతే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?