Rajinikanth Coolie Celebration.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. అంటే, ఆ స్టైల్‌కి నిన్నటి తరం మాత్రమే కాదు, నేటి తరం.. అలానే రేపటి తరం కూడా ఫిదా అవ్వాల్సిందే.
రజనీకాంత్ గొప్ప డాన్సర్ కాదు.. గొప్ప నటుడూ కాదు.. అందగాడు అసలే కాదు.! కానీ, రజనీకాంత్అంటే, అంతకు మించి.!
ఓ సాధారణ బస్ కండక్టర్, దేశం మెచ్చిన సూపర్ స్టార్ అయ్యాడంటే.. ఎంతోమందికి స్ఫూర్తి అది. సినిమా రంగంలో రాణించాలనుకునేవారికి, ఆయన ఓ రోల్ మోడల్.
వయసు మీద పడింది.. తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు.. బతుకుతాడో బతకడోనన్న పరిస్థితుల నుంచి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే స్థాయికి మారింది పరిస్థితి.
Rajinikanth Coolie Celebration.. అది తెలివైన నిర్ణయం..
రాజకీయాల్లోకి వెళదామనుకుని, చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు రజనీకాంత్. బహుశా అది, అత్యంత తెలివైన నిర్ణయం అయి వుంటుంది కూడా.
రజనీకాంత్ నుంచి తాజాగా ‘కూలీ’ సినిమా వచ్చింది. కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్ళు వచ్చి పడుతున్నాయి ‘కూలీ’ సినిమాకి.
లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’ సినిమాలో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర.. ఇలా వివిధ సినీ పరిశ్రమల నుంచి స్టార్లు నటించారు.
నెగెటివ్ రివ్యూలు వచ్చినా..
‘కూలీ’ సినిమాకి నెగెటివ్ రివ్యూలు వచ్చాయ్.. నిజంగానే, సినిమాలో కొన్ని ఫ్లాస్ వున్నాయ్.. కానీ, ‘కూలీ’ సినిమాని ఓ సెలబ్రేషన్.. అనుకుంటున్నారు సగటు సినీ ప్రేక్షకులు.
రజనీకాంత్ యాభయ్యేళ్ళ నట ప్రస్తానానికి దక్కిన గౌరవం ఇది.. అనుకోవాలేమో.! అంతే మరి.! నిజమే, సీనియర్ హీరోల సినిమాలకు సంబంధించి ఇలాంటి సెలబ్రేషన్ తప్పనిసరి.
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి.. వీళ్ళంతా హీరోలు కాదు, అంతకు మించి.! వీళ్ళ సినిమాల్లో లోతుపాతుల్ని వెతకడం కాదు, ‘సెలబ్రేషన్’గా మాత్రమే చూడాలి.
Also Read: నాన్సెన్స్.. హృతిక్ రోషన్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నారా.?
సోషల్ మీడియాలో ట్రోలింగ్ అంటారా.? ఫ్రీ డేటా.. ప్రతి పనికిమాలినోడి చేతిలోనూ మొబైల్.. ఆపై సోషల్ మీడియా.! చెత్త కామెంట్లు పోస్ట్ చేయడానికి ఇంకేం కావాలి.?
చెత్త రివ్యూల విషయానికొస్తే, సినిమా చూడకుండానే, అసలంటూ సినిమా అంటే ఏంటో కూడా తెలియనోళ్ళు రాస్తున్న రివ్యూలు సినిమాల్ని నాశనం చేస్తున్నాయ్.