Rajnikanth Brand సీనియర్ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఓ హెచ్చరిక జారీ చేశాడు. అదీ లీగల్ నోటీసు ద్వారా.! ఛత్.. ఇదేం పద్ధతి.? అంటూ అతని అభిమానులే విసుక్కుంటున్నారు.!
అసలు విషయమేంటంటే, అనుమతి లేకుండా రజనీకాంత్ ఫొటోలు, వీడియోలు, వ్యంగ్య చిత్రాలూ వాడెయ్యకూడదట.!
రజనీకాంత్ సెలబ్రిటీ హోదాలో వున్నారట. వ్యాపార పరంగా రజనీకాంత్ పేరు, ఆయన ఫొటోలు వినియోగించుకునే హక్కు ఆయనకి మాత్రమే వుంటుందట.
ఇది సోషల్ మీడియా యుగం..
కాదని ఎవరన్నారు.? అయినాగానీ, ఒక్కసారి పబ్లిక్‌లోకి వచ్చాక.. దేన్నయినా వాడేయొచ్చన్నట్టుందిప్పటి ట్రెండ్.
పైగా, ఇది మీమ్స్ యుగం. సోషల్ మీడియాలో ఎడా పెడా సెలబ్రిటీల ఫొటోలు, మీమ్స్ పోటెత్తుతుంటాయ్. వాటిని ఈ పబ్లిక్ నోటీసులతో నిలువరించడం అనేది సాధ్యమయ్యే పనేనా.?
అమితాబ్ బచ్చన్ నుంచి రజనీకాంత్ దాకా.. చిరంజీవి నుంచి మోహన్ లాల్ దాకా..
నాని, రవితేజ లాంటి హీరోలే కాదు.. కొత్తగా వస్తోన్న హీరోలూ.. యంగ్ హీరోలూ.. ఆ మాటకొస్తే హీరోయిన్లు కూడా బొమ్మల రూపంలోనో.. పేర్ల రూపంలోనో..
అధికారికంగానో.. అనధికారికంగానో.. వాడేయబడుతుంటారు. అలా వాడకూడదని సెలబ్రిటలంతా మూకుమ్మడిగా పబ్లిక్ నోటీసులు ఇస్తే ఏమవుతుంది.?
చివరికి వీరిపై మీడియాలో కూడా వార్తలు వచ్చే అవకాశం వుండదు.
Mudra369
‘మా సినిమా రజనీకాంత్‌కి బాగా నచ్చింది’ అని చెప్పుకుంటుంటారు కొందరు. ‘రజనీకాంత్ నాకు మంచి స్నేహితుడు.. అరేయ్, ఒరేయ్.. అనేంతటి అనుబంధం వుంది’ అని కథలు చెబుతారు ఇంకొందరు.
అగ్ర హీరోల విషయంలోనే కాదు, చిన్నా చితకా హీరోల విషయాల్లోనూ ఈ వాడకాలు మామూలే. అలాంటిది, ‘వాడేసుకోవద్దు’ అంటే అదెంతవరకు సబబు.?
Rajnikanth Brand అక్కడా.. ఇక్కడా..
టపాసుల బాక్సుల మీదా, సెలూన్ షాపుల దగ్గరా.. సెలబ్రిటీల ఫొటోలు సర్వసాధారణం. ‘అలా వాడటం కుదరదు’ అనేస్తే ఎలా సామీ.!
Also Read: పవన్ కళ్యాణ్ ‘కష్ట’ జీవి.! వాళ్ళకేమో ‘సుఖ’ వ్యాధి.!
ఇంకా నయ్యం.. ‘రజనీకాంత్’ అన్న పేరుని బ్యాన్ చేసేసి, ఇంకెవడూ ఆ పేరు పెట్టుకోలేదని హుకూం జారీ చేసెయ్యలేదు.
ఇంతకీ, రజనీకాంత్ కనుసన్నల్లోనే ఈ ‘నోటీసులు’ బయటకు వచ్చాయా.? వస్తే మాత్రం, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.