Rakul Preet Jackky Bhagnani.. రకుల్ ప్రీత్ సింగ్‌కి పెళ్లయిపోయిందోచ్.! కోరుకున్న ప్రియుడు జాకీ భగ్నానీని ప్రేమ వివాహం చేసుకుంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.
గత మూడేళ్లుగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో వున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ నెల 21న గోవాలోని ఓ రిసార్ట్స్‌లో రకుల్ వివాహం ఘనంగా జరిగింది.

ఈ వివాహ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటూ, పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. సోషల్ మీడియా వేదికగా రకుల్ భగ్నానీ జంటకు విషెస్ పోటెత్తుతున్నాయ్.
‘ఎక్స్‌ప్రెస్’ స్పీడుతో స్టార్‌డమ్ దిశగా రకుల్
కాగా, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే రకుల్ విజయ పరంపర సాగింది టాలీవుడ్‌లో.

పరిచయమైన కొద్ది కాలంలోనే రామ్ చరణ్, ఎన్టీయార్.. ఇల స్టార్ హీరోలందరితోనూ స్ర్కీన్ షేర్ చేసుకుని స్టార్ హీరోయిన్ హోదాని దక్కించుకుంది.
అలాగే పలువురు యంగ్ హీరోలతోనూ నటించింది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో నాగ చైతన్యతో జోడి కట్టిన రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత టాలీవుడ్‌పై ఫోెకస్ తగ్గించేసింది. బాలీవుడ్‌కి చెక్కేసింది.
కోరుకున్న ప్రియుడ్నే కొంగుకి కట్టేసుకుంది.!
అక్కడ మొదట్లో కాస్త తటపటాయించినా.. ఆ తర్వాత నిలదొక్కుకుంది. వరుస ఆఫర్లు దక్కించుకుని, అక్కడా స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.
ఈ క్రమంలో టాలీవుడ్‌లో రకుల్‌కి కాస్త ఆఫర్లు తగ్గాయనే చెప్పొచ్చు. మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ పంజాతో ‘కొండపొలం’ అనే సినిమాలో నటించింది ఈ గ్యాప్‌లో రకుల్ ప్రీత్ సింగ్.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా గడుపుతోంది. అక్కడ ఒకే ఏడాది ఐదు సినిమాల్లో నటించి, సెన్సేషనల్ రికార్డు సృష్టించింది రకుల్ ప్రీత్ సింగ్.
Also Read: జగదేక వీరుడితో అతిలోక సుందరి.! కండిషన్స్ అప్లయ్.!
ఎట్టకేలకు కోరుకున్న ప్రియుడ్ని పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైపోయింది. మరి, పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సినిమాల్లో నటిస్తుందా.? లేదా.? చూడాలి మరి.