తెలుగులో సినిమాలు తగ్గించి, గత కొన్నాళ్ళుగా బాలీవుడ్‌లో వేగం పెంచింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).
‘ఎందుకిలా.?’ అనడిగితే, ‘ఒకప్పుడు హిందీలో సినిమాలు తగ్గించి, తెలుగులో ఎక్కువ సినిమాలు చేశాను కదా.!’ అని చెబుతుంటుందామె.
తెలుగులో ఒకప్పుడు కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే చేసిన రకుల్, క్రమంగా గేరు మార్చి.. భిన్నమైన కథాంశాలతో తెరకెక్కే సినిమాలు చేసింది.
సమ్‌థింగ్ స్పెషల్ రకుల్.!
నటిగా కెరీర్ మొదట్లో ఎలా వున్నానో, ఇప్పుడు అందుకు భిన్నంగా వున్నానని చెబుతుంటుంది రకుల్. ఈ మార్పు సమ్‌థింగ్ స్పెషల్.. పైగా, ఇది అనివార్యమని కూడా చెబుతోందామె.

తన తాజా చిత్రం ‘డాక్టర్ జి’ ప్రమోషన్లలో బిజీగా వున్న రకుల్ ప్రీత్ సింగ్, మేల్ గైనకాలజిస్ట్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
పధ్నాలుగేళ్ళ వయసులో గైనిక్ సమస్యతో వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు, డాక్టర్ మగవాడని తెలిసి సిగ్గుపడ్డాననీ, ఆందోళన చెందానని చెప్పుకొచ్చింది.
ఆ టచ్ వేరే వుంటుంది..
‘డాక్టర్ టచ్ వేరు.. మేల్ టచ్ వేరు..’ అని స్పష్టతనిచ్చేసింది రకుల్ ప్రీత్ సింగ్. నిజానికి, డాక్టర్ల విషయంలో మేల్ లేదా ఫిమేల్ అన్న విభజన వుండకూడదన్నది రకుల్ వాదన.
కార్డియాలజీ ఎలాగో గైనకాలజీ కూడా అంతేనంటున్న రకుల్, అనారోగ్య సమస్యకు పరిష్కారం చూపే డాక్టర్ ముఖ్యం తప్ప, ఆ డాక్టర్ మేల్ లేదా ఫిమేల్ అని చూడకూడదని అభిప్రాయపడింది.

‘డాక్టర్ జి’ సినిమా కోసం గైనకాలజిస్ట్ దగ్గర కొంతమేర శిక్షణ తీసుకోవాల్సి వచ్చిందనీ, గైనకాలజిస్టులు ఉపయోగించే వైద్య పరికాల పేర్లను తెలుసుకోవడం కష్టంగా మారిందని రకుల్ చెప్పింది.
Also Read: Samantha Ruth Prabhu.. ఆ నిగూడార్ధం ఏంటి.?
ఈ సినిమాలో రకుల్ గైనకాలజిస్టుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మహిళా గైనకాలజిస్టుల మధ్య మేల్ గైనకాలజిస్టుగా ఆయుష్మాన్ ఖురానా ఈ ‘డాక్టర్ జి’లో నటిస్తున్నాడు.
ఈ సినిమా చుట్టూ వివాదాలు మామూలే.! కానీ, ‘మేల్ టచ్’.. ‘డాక్టర్ టచ్’ అనే అంశాల మధ్య తేడాని ‘డాక్టర్ జి’ సినిమాలో చూపిస్తున్నామని అంటోంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.