Home » Bigg Boss Telugu 5: టఫ్ ఫైట్ వీళ్ళ మధ్యేనా.?

Bigg Boss Telugu 5: టఫ్ ఫైట్ వీళ్ళ మధ్యేనా.?

by hellomudra
0 comments
Bigg Boss Telugu 5 Tough Fight

Bigg Boss Telugu 5.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగింపు దశకు వస్తోంది. హౌస్ నుంచి ఒకరొకరుగా ఎలిమినేట్ అవుతున్నారు.. లేటెస్ట్ వికెట్ యానీ మాస్టర్. మరి, తదుపరి వికెట్ ఎవరిది.? ఏమోగానీ, హౌస్‌లో మాత్రం వాతావరణం వేడెక్కిపోయింది ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్స్ నేపథ్యంలో.

దాదాపుగా అందరూ ఒకరి మీద ఒకరు అరచుకున్నారు. కనీ వినీ ఎరుగని స్థాయిలో.. అనలేంగానీ, గట్టిగానే గొడవ జరిగింది. అయితే, గొడవ అంతా డ్రమెటిక్‌గానే నడిచింది. అక్కడికేదో ఈ డ్రామా క్రియేట్ చెయ్యకపోతే, బిగ్ బాస్ మొత్తం అందర్నీ ఒకేసారి ఎలిమినేట్ చేసి పారేస్తానని అన్నాడేమో.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

Bigg Boss Telugu 5 ఓవరాక్షన్ స్టార్స్.!

ఓవరాక్షన్ విషయంలో ఒకర్ని ఒకరు మించిపోయేందుకు పోటీ పడ్డారు. కంటెస్టెంట్లలో ఎవరూ సరైన రీజన్ చెప్పి అవతలి వ్యక్తిని నామినేట్ చేయలేకపోయారన్న భావన బిగ్ బాస్ వీక్షకుల్లో అయితే కనిపించింది. సన్నీ వర్సెస్ శ్రీరామచంద్ర డిస్కషన్ కాస్త ఘాటుగా నడిచింది.

Bigg Boss Telugu 5 Tough Fight
Bigg Boss Telugu 5 Tough Fight

రవి విషయంలో ఫిర్యాదులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిరి, షన్ను కూడా హడావిడి చేశారంతే. కాజల్ ఎప్పటిలానే కస్సుమంది. మానస్ కూడా తనదైన స్టయిల్లో ‘అతి’ చేసేశాడు. ఓవరాల్‌గా చూస్తే, డ్రమెటిక్ వేడి వాతావరణం నేపథ్యంలో, రచ్చ అయితే జరిగిందిగానీ.. ఎపిసోడ్ పూర్తయ్యాక.. బిగ్ బాస్ వీక్షకులకి షరామామూలుగా నీరసమే మిగిలింది.

Also Read: Jr NTR ‘మార్పు’కోసం నడుం బిగిస్తాడా.?

ఇదిలా వుంటే, ఈ రోజు ఎపిసోడ్ తర్వాత సన్నీ లేదా శ్రీరామచంద్ర.. ఈ ఇద్దరి మధ్యనే టైటిల్ కోసం టఫ్ ఫైట్ వుండొచ్చన్న అభిప్రాయమైతే బిగ్ బాస్ వీక్షకుల్లో బలపడింది. కానీ, బిగ్ బాస్ (Bigg Boss Telugu 5)ఎప్పుడెలాంటి ట్విస్టులు ఇస్తాడో చెప్పలేం.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group