Rakul Preet Singh Heroinsim.. సినిమా ఇండస్ర్టీలో మేల్ డామినేషన్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే వుంటుంది. హీరోలతో పోల్చితే హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎప్పుడూ తక్కువే.
ఈ అంశానికి సంబంధించి పలువురు హీరోయిన్లు గతంలో పలు విధాల అభిప్రాయాలు వెల్లిబుచ్చారు. అయినా రెమ్యునరేషన్‌లో ఈ లింగ బేధాన్ని మార్చలేకపోతున్నారు.
సౌత్‌లో అనుష్క, నయనతార తదితర ముద్దుగుమ్మలు హయ్యెస్ట్ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నప్పటికీ, స్టార్ హీరోల రెమ్యునరేషన్‌తో పోల్చితే అది చాలా చాలా తక్కువ.
Rakul Preet Singh Heroinsim.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం.!
ఇప్పుడెందుకీ రెమ్యునరేషన్ రచ్చ అంటారా.? తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రెమ్యునరేషన్‌కి లింగ బేధంతో సంబంధం లేదని చెప్పింది.
ఆడియన్స్‌ని ధియేటర్లకు రప్పించగల కెపాసిటీ మీదే రెమ్యునరేషన్ అనేది ఆధారపడి వుంటుందని ఓ వేల్యూడ్ పాయింట్ చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).

రెమ్యునరేషన్ విషయంలో మేల్ డామినేటింగ్.. ఇంకోటి అంటూ రకరకాల అభిప్రాయాలు వెల్లిబుచ్చిన వాళ్లకి రకుల్ వ్యాఖ్యలు కాస్త నొచ్చుకునేలా చేసినా, చాలా మందిని ఈ పాయింట్‌తో రకుల్ టచ్ చేసింది.
రకుల్ చాలా తెలివైనది. అందుకేనేమో ఇంత హుందాగా ఆలోచించింది. ఈ రెస్పాన్స్‌తో రకుల్‌ని మెచ్చుకునేటోళ్లు మరింత ఎక్కువయిపోయారు. రెమ్యునరేషన్‌పై రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.
ఛాన్సిస్తే మళ్లీ వస్తా..
ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగులు విరజిమ్మింది. అయితే ప్రస్తుతం సౌత్‌లో రకుల్ హవా తగ్గిందనే చెప్పాలి.
కానీ, బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ బిజీగా గడుపుతోంది. వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది.
Also Read: Anasuya Bharadwaj Athi: ‘ది’ ట్వీటు పోటు! స్టార్ హీరోలపై ఏడుపేల?
సినిమాలతో ఎంత బిజీగా వున్నా, ఎప్పుడూ సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ యాక్టివ్‌గా వుంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైనర్ వేర్‌లో హాట్ హాట్‌గా అందాలారేస్తూ తన ఫాలోవర్స్‌ని ఖుషీ చేస్తుంటుంది.
అలాగే, మంచి ఛాన్స్ వస్తే సౌత్ సినిమాల్లో నటించేందుకూ తాను సిద్ధమే అని చెబుతోంది అందాల రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).