Table of Contents
Rakul Preet Singh Patch.. కొన్నేళ్ళ క్రితం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేతి వేలికి ధరించిన రింగ్ అప్పట్లో హాట్ టాపిక్.!
శరీర ఉష్ణోగ్రత సహా, వివిధ రకాలైన పారామీటర్స్‌ని ఆ రింగ్, దానికి కనెక్ట్ చేసిన డివైజ్‌కి చేరవేస్తుంది. చాలామంది ఇప్పుడు ఈ తరహా రింగ్స్ వాడుతున్నారు.
ఆయా పారామీటర్స్ ఆధారంగా, ఆయా ప్రముఖుల వ్యక్తిగత వైద్యులు, వారి ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించి, తగిన వైద్య సలహాలు ఇస్తుంటారన్నమాట.
Rakul Preet Singh Patch.. రకుల్ ప్రీత్ సింగ్ సంగతేంటి.?
తాజాగా, నటి రకుల్ ప్రీత్ సింగ్ వీపు భాగంలో, వెన్నెముక పై భాగంలో.. అంటే, తల భాగానికి దగ్గర్లో.. ఇంకా చెప్పాలంటే, మెడ వెనుక భాగంలో.. ఓ ప్యాచ్ ధరించింది.
తాజాగా, ఓ సందర్భంలో రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన సదరు ప్యాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంకేముంది, దాని మీద రీసెర్చ్‌లు మొదలయ్యాయి.
సోషల్ మీడియా అంటే, ఇప్పుడు ఏఐ యుగం కూడా.! ఆ ప్యాచ్ సంగతేంటి.? అని ఇలా అడగ్గానే, అలా సంపూర్ణ సమాచారం లభించేస్తోంది.
ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్ రకుల్..
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కి ఏదన్నా అనారోగ్య సమస్య వుందా.? అందుకే, ఈ ప్యాచ్ వాడుతోందా.? అన్న డౌటానుమానాలు చాలామందికి కలిగాయి.
అయితే, ఎవరైనా ధరించగలిగేలా ఈ ప్యాచ్‌ని రూపొందించారు. ధర, సుమారుగా 20 వేల వరకూ వుంటుందట. ఒక్కటి కాదు లెండి, 30 వరకు ప్యాచ్‌ల ధర ఇది.

ఉదయాన్నే ఈ ప్యాచ్, శరీరానికి అంటించేసుకుని, పన్నెండు గంటల తర్వాత తీసెయ్యొచ్చు. ఆ తర్వాత అది పనికిరాదు. ఏకబిగిన నెల రోజులు వాడితే సత్ఫలితాలు వుంటాయట.
అంటే, నెల రోజులకి సుమారుగా ఖర్చు 40 వేల రూపాయలన్నమాట. ఇంతకీ, ఇదెలా పని చేస్తుంది.? దీని కథ ఏంటి.?
శక్తినిస్తుంది.. ఉత్సాహాన్నిస్తుంది..
ఇందులో ఎలాంటి ఔషధాలూ లేవు. ఇది కేవలం, శరీరాన్ని ఉత్తేజితం చేసేలా రూపొందించబడింది. ప్యాచ్ నుంచి కొన్ని తరంగాలు, వెన్నుభాగాన్ని ఉత్సాహపరుస్తాయట.
వెన్ను భాగంలోనే కాదు, పొట్ట భాగంలో కూడా.. అదీ, నాభీ కిందన ఈ ప్యాచ్ తగిలించుకోవచ్చునట. ‘లైఫ్ వేవ్ ఎక్స్ 39 ప్యాచ్’ పేరుతో మార్కెట్‌లో అందుబాటులో వుందిది.
ఇది నిజంగానే, శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుందా.? ఏమో, వాడిన వాళ్ళే దీనికి రేటింగులు ఇవ్వాలి.
రకుల్ ప్రీత్ సింగ్ అంటే, పాన్ ఇండియా హీరోయిన్ కదా.. ఆమె ఏ ఉద్దేశ్యంతో, ఈ ప్యాచ్‌ని ధరించిందోగానీ, ఇప్పుడంతా ఈ ప్యాచ్ గురించే చర్చించుకుంటున్నారు.