Table of Contents
Pawankalyan Kavitha Serious Politics.. పవన్ కళ్యాణ్ అంటే, కేవలం ఓ రాజకీయ పార్టీకి అధినేత మాత్రమే కాదు.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా.!
సీరియస్ పొలిటీషియన్ కాకపోతే, ఓ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఎలా ముఖ్యమంత్రి అవుతారు.? ఓహో, గులాబీ పార్టీ హయాంలో, సిల్లీ పొలిటీషియన్లకు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా.?
సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే, దాన్ని ఓ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. కల్వకుంట్ల కవితకీ, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై మాట్లాడటం నచ్చడంలేదెందుకో.!
Mudra369
ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత ఓ ఇంటర్వ్యూలో, పవన్ కళ్యాణ్ మీద చేసిన ‘సీరియస్’ కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్.. రెండూ వేర్వేరు రాష్ట్రాలు. జాతీయ పార్టీ.. అని చెప్పుకుంటోంది బీఆర్ఎస్. అందుకే, టీఆర్ఎస్ కాస్తా, పేరు మార్చుకుని బీఆర్ఎస్ అయ్యింది.
మాటలు కోటలు దాటుతాయ్.. చేతలు మాత్రం..
జాతీయ పార్టీ అన్నాక, సాటి తెలుగు రాష్ట్రంలో అయినా పోటీ చెయ్యాలి కదా.? మాటలు కోటలు దాటతాయ్.. చేతలు మాత్రం గడప కూడా దాటదు గులాబీ పార్టీకి.
ఇక, జనసేన విషయానికొస్తే.. గెలుపోటములతో సంబంధం లేకుండా, పదేళ్ళ నిఖార్సయిన రాజకీయ ప్రస్తానం జనసేనాని పవన్ కళ్యాణ్ సొంతం.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వున్నారు పవన్ కళ్యాణ్. ఆయన మీద ఓ ఇంటర్వ్యూలో కవిత, అనవసరపు వ్యాఖ్యలు చేసేశారు.
దళిత మహిళా మంత్రి మీద.. పవన్ కళ్యాణ్ బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారన్నది కవిత ఆరోపణ. ఆ దళిత మహిళా మంత్రి స్వయంగా, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని అర్థం చేసుకున్నారు.
లిక్కర్ స్కామ్.. తీహార్ జైల్.. సీరియస్ పోలిటిక్స్.!
మధ్యలో కవితకి వచ్చిన ఇబ్బంది ఏంటి.? అసలు సీరియస్ పొలిటీషియన్ అంటే, ఎలా వుండాలి.? లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుని, తీహార్ జైలుకు వెళ్ళడమేనేమో సీరియస్ పొలిటీషియన్‌కి వుండాల్సిన లక్షణం.
రాజకీయంగా తమ ఉనికి ప్రశ్నార్థకం అనుకున్నప్పుడు, పవన్ కళ్యాణ్ మీద నాలుగు పనికిమాలిన కామెంట్లు చేస్తే, ట్రోలింగ్ జరిగినా పాపులారిటీ వస్తుందనుకునే దిగజారుడుతనం కొందరికి వుంటుంది.
నేనైతే, పవన్ కళ్యాణ్‌ని సీరియస్‌గా తీసుకోను.. అని కవిత కల్వకుంట్ల అనేశారుగానీ, అసలు మీరు సీరియస్‌గా తీసుకుంటే ఎంత.? తీసుకోకపోతే ఎంత.? మీరు జస్ట్ ఎమ్మెల్సీ మాత్రమే.. పవన్ కళ్యాణ్ ఎవరో తెలుసు కదా, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.!
Mudra369
బహుశా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఆ బాపతే అయి వుండొచ్చుగాక. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడే.. అని చెప్పిన పార్టీ, అధికార పీఠమెక్కి.. రెండు దఫాలు తెలంగాణని పాలించింది.
కానీ, దళితుడికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా, కేసీయార్ తానే సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఏ దళితుల గురించి కవిత మాట్లాడుతున్నట్లు.?
Pawankalyan Kavitha Serious Politics.. రాజకీయాల్లో లేకితనం మంచిది కాదు..
కాంగ్రెస్‌తో కలిసింది టీఆర్ఎస్, టీడీపీతో, వామపక్షాలతోనూ కలిసింది టీఆర్ఎస్. బీజేపీతో కూడా ఒకప్పుడు టీఆర్ఎస్ కలిసిన సందర్భం వుంది. ఇవన్నీ కవిత మర్చిపోతే ఎలా.?
చేగువేరా గురించీ, సనాతన ధర్మం గురించీ పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో వివరణ ఇచ్చారు. ఆ వివరణ కవితకు అర్థం కాకపోతే, పవన్ కళ్యాణ్ తప్పు కాదు కదా.!
రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.. అసందర్భ ప్రేలాపన అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.! నో కామెంట్.. అనాల్సిన చోట, ‘సీరియస్‌నెస్’ అంటూ, సిల్లీ వ్యాఖ్యలు చేయడం.. లేకితనమే.!
Mudra369
ఏతావాతా చెప్పేదేంటంటే, పవన్ కళ్యాణ్ మీద తేలిక వ్యాఖ్యలు చేసి, పాపులారిటీ పెంచుకోవాలన్న ‘లేకి’ ఆలోచనలు మానేసి, తెలంగాణ రాజకీయాలకే కవిత పరిమితమైతే మంచిది.
గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి వచ్చిన సీట్లు ‘జీరో’.! అదే లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన రెండు చోట్లా ఘన విజయం సాధించింది. ఈ ఈక్వేషన్ సరిపోతుంది కదా.. సీరియస్ పొలిటీషినయన్.?
కొసమెరుపు..
తెలంగాణ జైళ్ళలో వద్దు, రాజమండ్రి జైలుకి జగన్‌ని పంపించెయ్యాలంటూ, జగన్ ఉనికినే ఒకప్పుడు తట్టుకోలేకపోయిన కవిత, ‘జగన్ 2.0’ అంటే ఇష్టమని వ్యాఖ్యానించడమేంటో.! ఇదేమీ, పేటీఎం కూలీ వ్యవహారం కాదు కదా.?