Ram Charan 18years Peddi.. మెగా పవర్ స్టార్.. గ్లోబల్ స్టార్.. ఇవన్నీ తర్వాత.! ముందైతే, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అంటే.!
మెగాస్టార్ చిరంజీవి లెగసినీ సినీ రంగంలో కొనసాగించడం అంటే, ఆషామాషీ వ్యవహారం కాదు. తొలి సినిమా ‘చిరుత’తోనే తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు రామ్ చరణ్.
‘మగధీర’ సినిమాతో అయితే, తండ్రిని మించిన తనయుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా, నటుడిగా రామ్ చరణ్‌ని ఇంకో మెట్టు పైకెక్కించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రామ్ చరణ్‌ని గ్లోబల్ స్టార్‌గా మార్చింది.
Ram Charan 18years Peddi.. పద్ధెనిమిదేళ్ళ మెగా గ్లోబల్ స్టార్ ప్రయాణం..
పద్ధెనిమిదేళ్ళ సుదీర్గ ప్రయాణంలో, విమర్శకుల ప్రశంసలు.. బోల్డన్ని పురస్కారాలూ రామ్ చరణ్ సొంతమయ్యాయి. అవార్డుల్ని మించిన అభిమానాన్ని సంపాదించుకున్నాడు రామ్ చరణ్.
త్వరలో, ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాగా, రామ్ చరణ్ పద్ధెనిమిదేళ్ళ సినీ ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, ‘పెద్ది’ టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ లుక్ రివీల్ చేసింది.
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో ఊర మాస్ గెటప్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ‘పెద్ది’లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సన ‘పెద్ది’ సినిమాకి దర్శకుడు. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ‘పెద్ది’ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం విదితమే.
ఇదిలా వుంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పద్ధెనిమిదేళ్ళ సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న దరిమిలా, మెగాస్టార్ చిరంజీవి, సోషల్ మీడియా వేదికగా ‘పుత్రోత్సాహాన్ని’ పంచుకున్నారు.
Also Read: Pawan Kalyan OG Review.. పవర్ తుఫాన్.!
చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను.
నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.
తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు…!
.. అంటూ, చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.!
