RRR Ram Charan Jr NTR SS Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇటీవలే చిత్ర యూనిట్ ‘దోస్తీ’ పేరుతో ఓ మ్యూజికల్ వీడియో (Ram Charan Dosti Jr NTR RRR Movie) విడుదల చేసింది. ఐదు భాషల్లో విడుదలైన ఈ సాంగ్ సూపర్ హిట్టయ్యింది కూడా.
ఇక, ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), జూనియర్ ఎన్టీయార్ (Young Tiger Jr NTR). ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం వుంది.
Also Read: అందం వెనుక ఆవేదన.. అనుపమకి ఏమైంది.?
కానీ, ఇటు చరణ్.. అటు ఎన్టీయార్.. ఇద్దరూ మంచి స్నేహితులు. ఆ విషయం పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది కూడా.
నిజానికి, తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు రావాలంటే, హీరోలు ముందడుగు వేయాలి.. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఆ అడుగులు వడివడిగా పడుతున్నాయి కూడా. కానీ, అభిమానులే కలవడానికి ఇష్టపడ్డంలేదు. ‘మా హీరో గొప్ప..’ అని ఒకరంటే, ‘కాదు మా హీరో గొప్ప..’ అంటూ ఇంకొకరంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకర్ని ఉద్దేశించి ఇంకొకరు విపరీతంగా ట్రోలింగ్ చేసేసుకుంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం మేకర్స్ చాలా కష్టపడుతున్నారు, ఎన్టీయార్ – చరణ్ మధ్య స్నేహాన్ని ఎలివేట్ చేసేందుకు. కానీ, అదేదీ అభిమానుల్ని ఒక్కటి చేయలేకపోతోంది. చరణ్, ఎన్టీయార్ (Ram Charan Jr NTR) కలిసి విజ్ఞప్తి చేసినా సోకాల్డ్ దురభిమానులు మారేలా కనిపించడంలేదు.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ చరణ్ – ఎన్టీయార్‌ల స్నేహమే. కానీ, అదే పెద్ద మైనస్ అయిపోతోంది.. దురభిమానుల దుర్బుద్ధి కారణంగా. సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.. అభిమానుల మధ్య ఈ వైరం, మేకర్స్‌ని కొంత ఆందోళనలోకి నెట్టేస్తోందేమో.
Also Read: ‘లైగర్’ కథా కమామిషు ఏంటో తెలుసా.?