మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీయార్.. (Ram Charan Jr NTR RRR Brothers) అన్నదమ్ముల్లా మారిపోయారు. ఎవరు వయసులో పెద్ద.? ఎవరు వయసులో చిన్న.? అన్న విషయం పక్కన పెడితే, ‘మై బ్రదర్’ అని యంగ్ టైగర్ ఆప్యాయంగా పిలుస్తోంటే, అంతకన్నా ఆప్యాయంగా ‘నా తమ్ముడు’ అంటాడు మెగా పవర్ స్టార్.
‘అన్న మహేష్..’ (Super Star Maheshbabu) అని జూనియర్ ఎన్టీయార్, సూపర్ స్టార్ మహేష్ గురించి చెబుతాడు. మహేష్ – రామ్ చరణ్ (Ram Charan) మధ్య మళ్ళీ ప్రత్యేకమైన అనుబంధముంది. అల్లు అర్జున్ – (Allu Arjun) ఎన్టీయార్ మధ్య ‘బావా’ అని పరస్పరం పిలుచుకునేంత చనువుంది.
చెప్పుకుంటూ పోతే, సినీ పరిశ్రమలో ఎవరూ ఎవరికీ విరోధులు కాదు. వృత్తిపరమైన పోటీ వుంటుందంతే. అది వుండాలి కూడా. వసూళ్ళ లెక్కల గురించి మాట్లాడేటప్పుడూ, ఇతర రికార్డుల ప్రస్తావన వచ్చేటప్పడు.. ఆయా సినిమాల గురించి గొప్పగా మాట్లాడటం అనేది మార్కెటింగ్ టెక్నిక్.
‘మేమంతా కలిసే వుంటాం.. మీరెందుకు కొట్టుకుంటారు.?’ అని హీరోలు పలు సందర్భాల్లో అభిమానుల్ని ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్న నిజమైన అభిమానులకి కాదు, దురభిమానులకి మాత్రమే. కులాల పేరుతో దురభిమానులు విడిపోయి, సోషల్ మీడియా నిండా హీరోల పేరుతో కులగజ్జి నింపేస్తుంటారు. అదే అన్ని సమస్యలకీ కారణం.
నటన అనేది ఓ గొప్ప కళ. నటనా రంగంలో రాణించడం అనేది ఓ అద్భుతమైన కల. గొప్ప నటుడనిపించుకోవడానికి కలలు కంటుంటారు. ఈ క్రమంలో పరాజయాలు మామూలే.. సక్సెస్సులు కూడా మామూలే. నిండా కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలెక్కువన్నట్టు.. ఈ ట్రోలింగ్ కూడా అంతే.
ఆ హీరో.. ఈ హీరో అన్న తేడాల్లేవు.. దాదాపుగా అందరూ అన్నదమ్ముల్లానే వుంటారు. అందుకు చాలా సందర్భాలు నిదర్శనంగా కనిపించాయి. ఇప్పుడిక మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగింది. అద్భుతమైన కాంబినేషన్లు పెట్టవుతున్నాయి.
‘మై బ్రదర్’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా (Ram Charan Jr NTR RRR Brothers) శుభాకాంక్షలు చెప్పాడు. ముందే చెప్పుకున్నాం కదా.. హీరోల మధ్య గొడవల్లేవ్.. అభిమానుల మధ్యనే.. అది కూడా దురభిమానుల మధ్యనే ఈ రచ్చ.