Ram Charan NTR Friendship.. జక్కన్న అన్న పేరు ఊరికే వచ్చేయలేదు. రాజమౌళి అంటేనే, వెరీ వెరీ స్పెషల్. ఒక్కో సినిమాని తెరకెక్కించడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటాడు. నెలలూ, సంవత్సరాలూ గడిచిపోతాయ్. పది చెత్త సినిమాలు తీయడం కన్నా, నిఖార్సయిన హిట్టు పదేళ్లకోసారి తీసినా ఆ మజా వేరే లెవల్.
తన సినిమాని ఎంత జాగ్రత్తగా తెరకెక్కిస్తాడో, అంత కన్నా జాగ్రత్తగా ఆ సినిమాని రాజమౌళి (SS Rajamouli) ప్రమోట్ చేస్తాడు. హీరో, హీరోయిన్లు ఎవరైనా రాజమౌళి బ్రాండ్ ఆయా సినిమాల్ని ఇంకో స్థాయికి తీసుకెళతాయి. రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ (RRR Movie) కోసం రాజమౌళి.. చరణ్, ఎన్టీయార్ స్నేహాన్ని ఎలివేట్ చేస్తున్నాడు.
Ram Charan NTR Friendship.. ఈ స్నేహమెంత మధురం.?
అవునా.? చరణ్, ఎన్టీయార్ అంత మంచి స్నేహితులా.? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. మెగా, నందమూరి అభిమానుల్ని ఒక్క తాటి పైకి తెస్తున్నాడు. చరణ్, ఎన్టీయార్ అల్లరి కారణంగా షూటింగ్ కొంత డిలే అయ్యిందట.

ఇద్దరికీ ముప్పై ఏళ్లు దాటినా, అల్లరి తగ్గలేదనీ, సెట్‌లో చిన్న పిల్లల్లా అల్లరి చేసేవారనీ, ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసేవారనీ రాజమౌళి సరదా సరదాగా చెప్పేశాడు. రాజమౌళి చెప్పడం ఒక ఎత్తయితే, ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ నటి అలియా భట్ అదే విషయాన్ని చెప్పడం ఇంకో ఎత్తు.
అలియా.. ఆ గిల్లుడేంటి.?
రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీయార్ (Jr NTR), అలియా భట్ (Alia Bhatt).. ఈ ముగ్గురూ ఒకే చోట ఉన్నప్పుడు అలియాని.. చరణ్, ఎన్టీయార్ పెద్దగా పట్టించుకోలేదట. ఆ విషయాన్ని స్వయంగా అలియా చెప్పింది. చరణ్, ఎన్టీయార్ ఒకరినొకరు ఆట పట్టించుకునేవారట. ఇద్దరూ కలిసి రాజమౌళి దగ్గర పంచాయతీ పెట్టేవారట. ఇలా అలియా చెప్పేసరికి అంతా ముక్కున వేలేసుకున్నారు.
చరణ్ (Mega Power Star Ram Charan), ఎన్టీయార్ (Young Tiger NTR) ఇద్దరూ చాలా ప్రొఫిషనల్. ఎన్టీయార్ సరదా మనిషి. రాజమౌళితో చనువు ఎక్కువ కూడా. మరి చరణ్ సంగతేంటీ.? చరణ్ మెచ్యూర్డ్, రిజర్వ్‌డ్. కానీ, చరణ్ కూడా అల్లరి అబ్బాయ్ అయిపోయాడంటే.. బహుశా ఎన్టీయార్ (Nandamuri Taraka Ramarao) వల్లనే కావచ్చు.
Also Read: అన్నదమ్ముల అనుబంధమిది.. కులగజ్జితో కొట్టకు చావొద్దు ప్లీజ్.!
ఈ ఇద్దరి అనుబంధమే (Charan NTR Friendship) ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి పెద్ద ప్లస్. తెరపై ఇద్దరి మధ్యా పోరాటం, ఇద్దరూ కలిసి చేసే పోరాటం, తెరపై పండించే వినోదం, భావోద్వేగాలూ, చూపించే ఎనర్జీ.. ఇవన్నీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఇంకో స్థాయిలో నిలబెట్టనున్నాయి.