Ram Charan Peddi Chikiri.. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఏఆర్ రెహమాన్, ఈ ‘పెద్ది’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ ‘పెద్ది’ నుంచి ‘ఫస్ట్ షాట్’ అంటూ కొన్నాళ్ళ క్రితమే ఓ ‘గ్లింప్స్’ వచ్చింది కూడా.
తాజాగా, ‘పెద్ది’ నుంచి, మరో ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియో బయటకు వచ్చింది. ‘చికిరి’ అంటూ, ఈ ప్రమోషనల్ వీడియోను ‘పెద్ది’ టీమ్ విడుదల చేసింది.
Ram Charan Peddi Chikiri.. రెహమాన్.. బుచ్చిబాబు సన.. ఇంట్రెస్టింగ్ డిస్కషన్..
‘చికిరి’ కోసం, దర్శకుడు బుచ్చిబాబు సన.. సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ మధ్యన.. ఆసక్తికర సంభాషణ జరిగింది.
‘ఫస్ట్ షాట్’ అదిరింది.. అని రెహమాన్‌తో బుచ్చిబాబు సన చెప్పాడు. ‘గ్రౌండ్‌లో వుండాలి కదా.. ఇక్కడేం చేస్తున్నారు.?’ అని రెహమాన్ అడిగాడు.
ఈసారి, ఓ పాట చేద్దాం.. అని బుచ్చిబాబు సన, సందర్భాన్ని రెహమాన్‌కి వివరించాడు. రెహమాన్ పాటల్ని తనకు పరిచయం చేసిన, తన సోదరుడి గురించీ ప్రస్తావించాడు.
ఈ క్రమంలో ‘చికిరి’ అంటే, ఓ అమ్మాయి అనీ.. కుర్రాళ్ళు అలా ముద్దుగా పిలుచుకుంటారనీ బుచ్చిబాబు సన చెబితే, సరే.. చేసేద్దామంటూ, రెహమాన్ ‘చికిరి చికిరి..’ అంటూ హమ్ చేశాడు.
రామ్ చరణ్ హుక్ స్టెప్..
డాన్సుల్లో మెగాస్టార్ చిరంజీవికి ధీటుగా ఎప్పుడో రామ్ చరణ్ వెండితెరపై సత్తా చాటాడు. తాజాగా, ‘పెద్ది’లోని ‘చికిరి’ గ్లింప్స్‌లో చూపించిన హుక్ స్టెప్.. వేరే లెవల్ అంతే.
మాస్, ఊర మాస్.. స్టెప్ అది.! దానికి, రామ్ చరణ్ తనదైన క్లాస్ టచ్‌ని కూడా అద్దాడు.! జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట తెరకెక్కినట్లు కనిపిస్తోంది.
‘చికిరి’ గ్లింప్స్ విడుదలైన నిమిషాల వ్యవధిలో, ఎడా పెడా రీల్స్ షురూ అయ్యాయి. వందల్లో కాదు, వేలల్లో కాదు.. లక్షల్లో తయారైపోయాయి రీల్స్.!
ఈ ‘చికిరి’ రీల్స్ ట్రెండ్, ఆ పాట తాలూకు లిరికల్ వీడియో వచ్చాక.. అంతకు మించిన జోరు ప్రదర్శిస్తుందని వేరే చెప్పాల్సిన పనిలేదు.
