Ram Charan Swamy Mala.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఏమయ్యింది.? ఇండియాలో అయ్యప్పస్వామి మాలలో కనిపించిన మెగా పవర్ స్టార్, అమెరికాలో మాత్రం మోడ్రన్ లుక్‌లో కనిపించాడు.!
మధ్యలో ఏం జరిగింది.? ఇండియాలోని ఎయిర్ పోర్టుకి వెళుతూ అయ్యప్ప స్వామి మాలలో కనిపించి, అమెరికాలో దిగాక మోడ్రన్ డ్రస్సులోకి ఎలా మారిపోయాడు.? ఈ విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది.
అమెరికాలో ప్రతిష్టాత్మక ‘హెచ్‌సిఎ’ అవార్డుల ప్రదానోత్సవంలో, ఓ ప్రెజెంటర్‌గా రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్ళాడు రామ్ చరణ్.
Ram Charan Swamy Mala.. అయ్యప్ప స్వామి మాల వెనుక..
రామ్ చరణ్ (Mega Power Star Ramcharan) ఎప్పుడూ ఏదో ఒక మాలలో వుంటాడంటూ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కూడా ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది కూడా నిజమే.

కొన్నాళ్ళ క్రితమే అయ్యప్ప మాల ధరించిన రామ్ చరణ్ (Konidela Ram Charan), దీక్షకు సంబంధించి 21 రోజులు పూర్తి కావడంతో మాలను తీసేసినట్లు తెలుస్తోంది.
అమెరికాలోని ఓ దేవాలయంలో మాలను తీసేసి, దీక్ష ముగించిన రామ్ చరణ్ (Global Star Ram Charan), ఆ తర్వాతే మోడ్రన్ లుక్‌లోకి మారాడట.
స్టైలింగ్ చకచకా..
దీక్ష విరమణ అనంతరం.. అక్కడే స్టైలింగ్ మార్చేశాడు రామ్ చరణ్ (Man Of Masses Ram Charan). అత్యంత ప్రతిష్టాత్మక ఈవెంట్ కదా.. అందుకే, రామ్ చరణ్.. పెర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అమెరికా వెళ్ళాడన్నమాట.
Also Read: సంక్రాంతికి ప్రభాస్ ‘Project-K’ తొందరపడ్డారేమో.!
అన్నట్టు, ఈ అవార్డుల రేసులో ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమా కూడా పోటీ పడుతోంది. రామ్ చరణ్ అలాగే ఎన్టీయార్ కూడా రేసులో వున్నారు.
ఇదిలా వుంటే, అమెరికా వెళ్ళిన రామ్ చరణ్‌కి (Mega Power Star Ram Charan) అక్కడ పెద్దయెత్తున అభిమానులు ఘన స్వాగతం పలికారు.