Ram Gopal Varma ‘శ్రీనుగారూ బాగున్నారా.? అనడానికీ.. నీ యమ్మ మొగుడు బాగున్నాడా అనడానికీ చాలా తేడా వుంటుందిరా.. బోసిడీకే..’ అని ఓ సినిమాలో డైలాగ్ వుంటుంది.!
‘నీ మనసు చెప్పేది మాత్రమే విను..’ అనడానికీ, ‘ఎవడు చెప్పినా వినకు..’ అనడానికీ అంతే తేడా వుంటుంది.
‘నా ఇష్టం వచ్చినట్లు నేను బతుకుతా..’ అనడం వేరు, ‘నీకు మగతనం వుంటే, నాలా బతుకు..’ అనడం వేరు.! అసలు ఇప్పడిదంతా ఎందుకు.?
Ram Gopal Varma Theory అంతా ఆర్జీవీ ఇష్టం.!
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ‘ప్రత్యేక ఆహ్వానితుడిగా’ పిలిచిందట. విద్యార్థుల్ని ఉద్దేశించి ఈ క్రమంలో ఆర్జీవీ మాట్లాడేశాడు.
ఆర్జీవీ నోరు విప్పితే, అందులో ‘సె..క్స్.’ తప్ప ఇంకేముంటుంది.? అంత పర్వర్టెడ్ మైండ్‌తో వుంటాడాయన. మొన్నామధ్య అషు రెడ్డి కాళ్ళు చీకుతూ చేసిన ఛండాలం అంతా ఇంతా కాదు.!
బరితెగించేసిన మూర్ఖత్వం.!
ఏ కూత కూసినా ఉచిత ప్రచారం కల్పించే మీడియా..
ఏ ఛండాలం ప్రదర్శించినా వెన్ను దన్నుగా నిలిచే రాజకీయం..
ఏం చెప్పినా యువత తనను అనురిస్తుందన్న మూర్ఖత్వం..
ఇవీ ఆర్జీవీ బలాలు.!
నలుగురూ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.? అనుకుంటుంటాడు..
నిస్సిగ్గుగా ఈ కుహనా మేధావి.!
Mudra369
బరితెగించేస్తే ఎవడైనా అలాంటివి చేయగలడు. ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. వాటిల్లో ఈ తరహా ఛండాలాలు చాలానే కనిపిస్తాయ్.
ఇంకాస్త ‘లోతుగా’ చూస్తే, రకరకాల యాక్స్‌లో జుగుప్సాకరమైన కంటెంట్ కనిపిస్తోంది. ‘నేను సుఖ పురుషుడ్ని’ అని చెప్పుకుంటున్న వర్మ, వాటిని కూడా ఓ సారి చూస్తే.. ఎంతమంది సుఖపురుషులున్నారో అర్థమవుతుంది.
యూనివర్సిటీ పరువు బజార్న పడింది..
అసలు ఆ యూనివర్సిటీ ప్రతినిథులు రామ్ గోపాల్ వర్మని ఏ కేటగిరీలో ఆహ్వానించారు.? రాజకీయ ఒత్తిళ్ళా.? ఇంకేమైనా ఆశించి, అలాంటోడ్ని ఆహ్వానించారా.? అన్నది తేలాల్సి వుంది.
సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నావ్.? అని రామ్ గోపాల్ వర్మని ప్రశ్నిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే, అతనిలో సభ్యతే వుండదు గనుక.!
ఎవరికో బానిసత్వం చేస్తూ, ఇంకెవరి మీదనో పడి ఏడుస్తూ.. ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా వేదికగా అసభ్యతను ప్రచారం చేస్తూ.. ఇదీ ఆర్జీవీ అనుసరిస్తున్న తప్పుడు మార్గం.!
Also Read: మాస్ అమ్మ మొగుడు.! ఎన్టీయార్‌కే ధమ్కీ ఇచ్చినవ్.!
పైగా, తనదో సిద్ధాంతమంటాడు.! ఆ తప్పుడు సిద్ధాంతానికి మళ్ళీ ఫ్యాన్స్.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
ఇలాంటోడ్ని ఎంకరేజ్ చేస్తే మీడియా సంస్థలు సైతం.. సమాజాన్ని చెడగొట్టడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నామని తెలుసుకోకపోవడం శోచనీయం.!