Rama Rao On Duty Director.. సోషల్ నెగెటివిటీ.. ఈ మధ్య సినిమాల్ని పట్టి పీడిస్తోన్న జాడ్యమిది.! ‘వకీల్‌సాబ్’, ‘భీమ్లానాయక్’, ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’ ఇలా చాలా సినిమాల్ని దెబ్బేసింది ఈ నెగెటివిటీ.
‘పుష్ప ది రైజ్’, ‘ఆర్ఆర్’ చిత్రాలకీ ఈ సోషల్ నెగెటివిటీ తప్పలేదు. అయితే, కేవలం సోషల్ నెగెటివిటీ వల్లనే సినిమాలు దెబ్బతింటాయా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
సినిమా రిలీజ్ గురించి ఏవేవో చెప్పేస్తారు.. రకరకాల ప్రచారాలు చేస్తారు. తీరా స్క్రీన్ మీద సినిమా వచ్చేసరికి, ‘అంత సీన్’ వుండదు. దాంతో ప్రేక్షకులు హర్ట్ అయి, సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు.
సోషల్ మీడియా మీదనే రెట్టలేస్తారా.?
సినిమాలే కాదు, రాజకీయాలపైనా సోషల్ మీడియాలో చాలా చాలా నెగెటివిటీ కనిపిస్తుంటుంది. దీన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు.

పోషల్ మీడియాని చూసి రాజకీయాల్లో ఓట్లు వేస్తారా.? సోషల్ మీడియాని బేస్ చేసుకుని సినిమాలు చూడటం, చూడకపోవడం అనేది వుంటుందా.?
దర్శకుడు శరత్, తన తాజా సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘ట్విట్టర్‌లో రెట్టలు వేస్తారు..’ అంటూ, ఒకింత ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు.
Rama Rao On Duty Director.. చెత్త సినిమాల్ని ఏమనాలి.?
ట్విట్టర్‌లో వేసేవి రెట్టలైతే, చెత్త సినిమాలు తీసేవారిని ఏమనాలి.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంటుంది. సోషల్ నెగెటివిటీని ఆపడం ఎవరి తరమూ కాదు.
ఆ సోషల్ మీడియాలోనే కదా, ఫ్లాప్ సినిమాని కూడా సూపర్ హిట్.. అని ప్రచారం చేసుకునేది. దాన్నేమనాలి.? అన్నది కొందరి వాదన.
Also Read: నిత్యా మీనన్ పెళ్ళి గోల.! కండిషన్స్ అప్లయ్.!
రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మీద మంచి బజ్ వుంది. కానీ, దర్శకుడు శరత్ వ్యాఖ్యలతో, నెటిజనం.. ఈ సినిమా తేడా కొడితే, ఓ ఆట ఆడేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఇంతకీ, మాస్ మహరాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాపై ‘రెట్టల ప్రభావం’ ఎలా వుుండబోతోంది.? వేచి చూడాల్సిందే.