Ramcharan JrNTR Fans War.. మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌కి అంతర్జాతీయ వేదికలపై వస్తున్న ప్రత్యేకమైన గుర్తింపుని చూసి మురిసిపోతే అది తప్పెలా అవుతుంది.?
కొత్తగా సినీ రంగంలోకి వస్తున్నవారిని సైతం చిరంజీవి ప్రోత్సహిస్తూ, వారి గురించి ట్వీట్లేయడమో.. ఆయా సినిమా వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవడమో చూస్తున్నాం.
అలాంటిది, కొడుకు ఎదుగుదలని చూసి చిరంజీవి ఉప్పొంగిపోకూడదా.? ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తాజాగా, ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ పురస్కారాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకోగా, ఆ వేదికపై తన కుమారుడికి దక్కిన గౌరవాన్ని చూసి చిరంజీవి ఉప్పొంగిపోయారు.
Ramcharan JrNTR Fans War.. ట్వీటేస్తే.. ఇంత రచ్చ అవసరమా.?
చిరంజీవి వేసిన ట్వీటులో రాజమౌళి ప్రస్తావన వుంది. కానీ, ఎన్టీయార్ ప్రస్తావన లేదు. అంతకు ముందు ఓ ట్వీటులో రాజమౌళిని ప్రస్తావించలేదంటూ కొందరు గోల చేశారు.

కానీ, గతంలో పలు సందర్భంలో ఎన్టీయార్‌ని చిరంజీవి ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్లేశారు. ఇప్పుడు కేవలం తన కుమారుడి ప్రస్తావన మాత్రమే చిరంజీవి చేశారంటే, అది పుత్రోత్సాహం. దాన్నెలా కాదనగలం.?
కానీ, చిరంజీవిని తూలనాడుతున్నొరు కొందరు ఎన్టీయార్ అభిమానులు. ప్రశ్నించాల్సింది నందమూరి బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్‌లని. అది చేతకాక, మెగా కాంపౌండ్ మీద పడి ఏడిస్తే ఏం లాభం.?
పవన్ కళ్యాణ్ అభినందించినా నేరమే..
పవన్ కళ్యాణ్ కూడా తన సోదరుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సాధించిన అరుదైన ఘనత పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్పందించారు. ఇది కూడా సోకాల్డ్ ఎన్టీయార్ అభిమానులకి నచ్చడంలేదు.
Also Read: RRR Movie: ‘హాలీవుడ్’ అవార్డుల మోత.!
నిజానికి, ఎన్టీయార్ అభిమానులు కాదు.. అలా ముసుగేసుకున్నోళ్ళతోనే అసలు సమస్య. చరణ్ – ఎన్టీయార్ అన్నదమ్ముల్లా కలిసి వుండడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీయార్ గెస్ట్ రోల్ చేశాడనీ, సపోర్టింగ్ రోల్ మాత్రమే చేశాడని ట్రోలింగ్ చేసినోళ్ళే, ఇప్పుడు ఎన్టీయార్ ముసుగేసుకుని. చరణ్ – ఎన్టీయార్ మధ్య విభేదాలకు తెరలేపారు.
అలాంటోళ్ళకి సోకాల్డ్ ‘తెగులు’ మీడియా వత్తాసు పాడటం ఒకటి.!
అయినా, యంగ్ టైగర్ ఎన్టీయార్, తన అభిమానుల్ని ఉద్దేశించి ఎన్నిసార్లు క్లాస్ తీసుకుంటున్నా.. అందులో కొందరికి ఎందుకు బుద్ధి రావడంలేదో ఏమో.!