Rana Daggubati చేసిన ప్రయోగాలు చాలు, ఇకపై అభిమానుల కోసం సినిమాలు చేస్తానంటున్నాడు నటుడు రానా దగ్గుబాటి.
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ తనయుడైన రానా, హీరోగా పలు ఫెయిల్యూర్స్ చవిచూశాడు. నిజానికి, రానా విలక్షణ నటుడు. అతన్నిప్పుడు హీరోగా మార్చేస్తే ఎలా.?
కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోవాలని రానా అనుకోవడం ఎంతవరకు సబబు.? ఇదే ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది.
విరాట పర్వం తెచ్చిన మార్పు.!
సాయి పల్లవి లేకపోతే ‘విరాట పర్వం’ సినిమానే లేదని రానా దగ్గుబాటి చెబుతున్నాడు. సాయి పల్లవి అంటేనే అంత. ఆమె ఏ సినిమా చేసినా, అందులో సాయి పల్లవిని తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేం.

పైగా, సాయి పల్లవి చేసే సినిమాల్లో హీరో ఎవరన్నది అప్రస్తుతంగా మారిపోతుంటుంది. ‘లవ్ స్టోరీ’ సినిమాలో నాగచైతన్య కూడా ఇలానే తేలిపోయాడు. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నాని కూడా అంతే.
Rana Daggubati.. కమర్షియల్ సినిమాలెందుకు చెయ్యకూడదు.?
రానా దగ్గుబాటి ‘లీడర్’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో కొన్ని కమర్షియల్ సినిమాలూ చేశాడు. అయితే, అవేవీ ఆయనకు ఆశించిన సక్సెస్సులు ఇవ్వలేదు.
ఎప్పుడైతే, కమర్షియల్ హీరో అన్న ఆలోచన పక్కన పెట్టి, రకరకాల పాత్రలు పోషించాలన్న ఆలోచనతో ముందడుగు వేశాడో, అప్పట్నుంచి రానా దగ్గుబాటికి స్టార్‌డమ్ పెరిగింది.
Also Read: నజ్రియా.! అప్పుడేమో వద్దు.. ఇప్పుడేమో ముద్దు.!
కమర్షియల్ సినిమాలు చెయ్యకూడదన్న రూల్ ఏమీ లేదు. అభిమానుల్ని అలరించే సినిమాలు చేయాలన్న రానా దగ్గుబాటి నిర్ణయాన్నీ తప్పు పట్టలేం.
కానీ, రానా అలాంటి సినిమాలకే పరిమితమైతే, ఓ మంచి నటుడ్ని మిస్ అవుతాం.. అన్నది రానా అభిమానులే చెబుతున్నమాట.