Rana Naidu Review.. టాలీవుడ్లో సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో పోల్చితే, వెంకటేష్‌ది డిఫరెంట్ ఇమేజ్.!
‘ఫ్యామిలీ హీరో’ అన్న ట్యాగ్ వుంది వెంకటేష్ మీద. అలాగని, ఆయనేమీ రొమాంటిక్ సినిమాలు చేయలేదని కాదు.!
కానీ, వెంకటేష్ (Venkatesh) అంటే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు. అయితే, ‘ఫ్యామిలీతో కలిసి చూడొద్దు’ అని వెంకటేష్ చెప్పేశాడు తన తొలి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu) గురించి.
సినిమాల్లో బూతులకు సెన్సార్ వుంటుంది..!
వెబ్ సిరీస్‌లలో బూతులకీ సెన్సార్ అవసరమేమో.!
బూతులే భవిష్యత్తు.. అనే స్థాయికి సీనియర్ నటుడు వెంకటేష్ దిగజారిపోయాడేంటో.!
యువ నటుడు రానా సైతం, ఇంతలా దిగజారిపోతాడనుకోలేదు.!
అభిమానుల మనోగతం.. వెంకీ, రానాలకు అర్థమవుతోందా.?
Mudra369
‘ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే సినిమా కాదు..’ అని వెంకటేష్ చెప్పినా, అతని అభిమానులు చూడకుండా వుంటారా.? చూశారు.. తుపుక్కున ఉమ్మేశారు.!
ఔను, అత్యంత జుగుప్సాకరంగా వున్నాయి ఈ వెబ్ సిరీస్‌లో డైలాగులు. వాటిని పలికేందుకు సిగ్గూ మొహమాటం లాంటివేవీ వెంకటేష్, రానా (Rana Daggubati) ప్రదర్శించకపోవడం ఆశ్చర్యకరం.
Rana Naidu వెబ్ సిరీస్ అంటే బూతులే కాదు..
వెబ్ సిరీస్ అంటే కేవలం బూతులేనన్న భ్రమల్లోంచి ఇంకా చాలామంది బయటకు రాలేదు. దానికి నిఖార్సయిన నిదర్శనం ఈ ‘రానా నాయుడు’.

నిజానికి, వెబ్ సిరీస్‌లలో కూడా చాలా క్లీన్‌గా వుండి హిట్టయినవి చాలానే వున్నాయ్. కానీ, ఎందుకో కొందరైతే కేవలం బూతుల్నే ఆశ్రయిస్తున్నారు.
Also Read: Pavitra Naresh Wedding: మీరు మామూలోళ్ళు కాదు సుమీ.!
వెంకటేష్, రానా కాంబినేషన్ అంటే ఎలా వుండాలి.? ఆ కాంబినేషన్‌కి వుండే క్రేజ్ ఏంటి.? ఇవేవీ పరిగణనలోకి తీసుకున్నట్టు లేరు ‘రానా నాయుడు’ మేకర్స్. కేవలం బూతుల్నే నమ్ముకున్నట్టుంది పరిస్థితి.
అయినా, వెంకటేష్ (Victory Venkatesh) ఎలా ఈ బూతుల్ని ఎంకరేజ్ చేసినట్లు.? కొన్ని సీన్స్ బావున్నాయి. చాలా సీన్స్ వరస్ట్‌గా వున్నాయ్. అన్నిటికీ మించి వెంకటేష్‌ని అలా చూడలేకపోయాం.. అన్న భావనే చాలామంది వ్యక్తం చేశారు.
రివ్యూ రాద్దామనుకుని ‘రానా నాయుడు’ ప్లే చేయడం మొదలు పెట్టిన కాస్సేపటికే.. ఆ బూతుల్ని భరించడం కష్టమైపోయింది.!
కేవలం బూతుల్ని ప్రమోట్ చేయడానికే వెంకటేష్, రానా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారేమో అనిపించింది.
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చేసినందుకు వెంకటేష్, రానా ఖచ్చితంగా సిగ్గుపడే పరిస్థితి వస్తుందన్నది మెజార్టీ అభిప్రాయం.
Mudra369
ఇలా టీవీ ఆన్ చేసి, అలా బూతులు వినలేక.. కట్టేసినోళ్ళే ఎక్కువ. కొంతమంది బలవంతంగా మొబైల్స్‌లో హెడ్సెట్ పెట్టుకుని ‘రానా నాయుడు’ పూర్తిగా చూడగలిగారు.
రానా (Rana Daggubati) కూడా తన బాబాయ్ వెంకటేష్‌తో (Victory Venkatesh) కలిసి ఈ సినిమాలో చేసిన ఛండాలం పట్ల ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిదేమో.!
‘పరంపర’ అనే పేరుతో కొన్నాళ్ళ క్రితం ఓ వెబ్ సిరీస్ వచ్చింది. సీనియర్ నటులు జగపతిబాబు, శరత్ కుమార్, యువ నటుడు నవీన్ చంద్ర తదితరులు నటించారు.
ఇందులో కథ కనిపిస్తుంది. బలమైన పాత్రలూ కనిపిస్తాయి. కానీ, ‘రానా నాయుడు’లో ఏముందని.. బూతులు తప్పితే.?