Ranbir Kapoor Adopted Son.. దత్త పుత్రుడు.. ఈ మాట తెలుగునాట రాజకీయాల్లో మార్మోగిపోవడానికి కారణమెవరో తెలుసు కదా.!
పనిగట్టుకుని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద రాజకీయంగా దుష్ప్రచారం చేయడానికి కొన్ని దుష్ట శక్తులు వాడే పదం ‘దత్త పుత్రుడు’.!
ఉత్త పుత్రుడు, చెత్త పుత్రుడు, జైలు పుత్రుడు.. ఇలాంటి నామధేయాలున్న ఓ రాజకీయ ప్రముఖుడు, పవన్ కళ్యాణ్ మీద ఏడుపుగొట్టు రాజకీయాలు చేయడంలో భాగంగా, ‘దత్త పుత్రుడు’ అనే మాట మాట్లాడుతుంటాడు.
సరే, ఆ సంగతి పక్కన పెడితే, ‘నేను తెలుగు రాష్ట్రాలకి దత్త పుత్రుడిని’ అంటున్నాడో సినీ ప్రముఖుడు.
Ranbir Kapoor Adopted Son.. దత్తపుత్రుడు రణ్‌బీర్ కపూర్..
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ తన తాజా చిత్రం ‘యానిమల్’ ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో రణ్‌బీర్ కపూర్, తనను తాను ‘అడాప్టెడ్ సన్’గా చెప్పుకున్నాడు.
మంచి మాటే కదా ఇది.! నిజానికి, ‘దత్త పుత్రుడు’ అంటే తప్పేమీ కాదు.! దాన్నొక తప్పుడు పదంగా మార్చేశాడు ఓ రాజకీయ ప్రముఖుడు. పేరెందుకు లెండి.. దండగ వ్యవహారమది.!
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ (Animal Movie) సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
బౌండరీలు చెరిగిపోయాయ్..
నటులకు బౌండరీస్ వుండవు.! టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. లాంటి లెక్కలేం లేవిప్పుడు. అంతా ఒకటే.. అదే ఇండియన్ సినిమా.!
తమ సినిమాల ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ ప్రముఖులు, సౌత్ సినీ పరిశ్రమలో సందడి చేస్తున్నారు. సౌత్ నుంచి, బాలీవుడ్‌కి కూడా అలాగే వెళుతున్నారు.
Also Read: Mehreen Pirzada.. పచ్చ పచ్చని పంచదార చిలకా.!
‘నేను, తెలుగు రాష్ట్రాలకి దత్త పుత్రుడిని..’ అని ఓ బాలీవుడ్ హీరో.. అందునా, స్టార్ హీరో అంటున్నాడంటే, అభినందించాల్సిందే.. ఆయన్ని స్వాగతించాల్సిందే.
‘దత్త పుత్రుడు’ అనే మాట గౌరవాన్ని తెలుగు నేలకు చెందిన ఓ రాజకీయ ప్రముఖుడు చెడగొడితే, ఆ మాటకి ‘గౌరవాన్ని’ పెంచాడు, రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor).!