Table of Contents
Rappa Rappa YSRCP Self Destruction.. రాజకీయ పార్టీల కార్యకర్తల అత్యుత్సాహం అందరికీ తెలిసిందే.! ఒక్కోసారి హద్దులు దాాటుతుంటారు.
అలాంటప్పుడే, ప్రత్యర్థుల నుంచి ఆయా రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. కార్యకర్తల్ని అదుపు చేసుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీల మీదనే వుంటుంది.
ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. రాజకీయ నాయకులు, వేదికల మీదకెక్కి కత్తులు చూపిస్తూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయకూడదు.
కానీ, దర్పం ప్రదర్శించడానికో, కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికో.. కత్తుల్ని చూపించడం అనేది పరిపాటిగా మారిపోయింది.
Rappa Rappa YSRCP Self Destruction.. పొట్టేళ్ళను నరికారు.. ప్రజల్ని కూడానా.?
కార్యకర్తలు ఇంకో అడుగు ముందుకేసి, వేట కత్తులతో పొట్టేళ్ళను నరికి, తమ అభిమాన రాజకీయ నాయకుల ఫొటోలు, ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడం ఫ్యాషన్ అయిపోయింది.
రాయలసీమలో కొందరు హీరోలకు సంబంధించిన కొత్త సినిమాలు వచ్చినప్పుడు, ఈ తరహా రక్తాభిషేకాల్ని చూస్తుంటాం. ఈ పైత్యం, ఇతర ప్రాంతాలకూ ఈ మధ్యన విస్తరించింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని, వైసీపీ కార్యకర్తలు ‘రప్పా రప్పా’ అంటూ, కత్తులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వికృత రూపం ప్రదర్శించారు.
తమతోపాటు పొట్టేళ్ళను తీసుకెళ్ళి, అందరూ చూస్తుండగానే వాటిని నరికి, వాటి రక్తంతో వైఎస్ జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు వైసీపీ కార్యకర్తలు.
అంతే కాదు, వైసీపీ వ్యతిరేకంగా పని చేస్తున్నవారందర్నీ ‘రప్పా రప్పా నరికేస్తాం’ అంటూ నినాదాలు చేశారు. అత్యంత అసభ్యకరమైన రీతిలో బూతులు తిట్టారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యతారాహిత్యం..
సంబంధిత వీడియోల్ని వాళ్ళే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి, ‘2029లో మేమే అధికారంలోకి వస్తాం.. చంపేస్తాం.. రప్పా రప్పా నరికేస్తాం..’ అంటూ రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు.
గత కొంతకాలంగా వైసీపీ శ్రేణులు ఎక్కడికి వెళ్ళినా, ‘రప్పా రప్పా’ అనే డైలాగులతో కూడిన ప్లకార్డుల్ని ప్రదర్శిస్తున్నారు. ‘నరికేస్తాం’ అంటూ బెదిరింపులు కూడా వాటిల్లో వుంటున్నాయి.
వీటిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. కానీ, ‘సినిమా డైలాగులు వాడితే నేరమా.?’ అంటూ సాక్షాత్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ కార్యకర్తల్ని వెనకేసుకొస్తున్నారు.
నిజానికి, ఇది మంచి సంప్రదాయం కాదు. రాజకీయాల్లో ఇలాంటి హింసాత్మక పోకడలకు చోటుండకూడదు. ఏ రాజకీయ పార్టీ కూడా వీటిని సమర్థించకూడదు.
ఉక్కుపాదం మోపాల్సిందే..
పార్టీ శ్రేణుల్ని అదుపు చేయాల్సిన వైఎస్ జగన్, వారిని హింస వైపు ప్రోత్సహిస్తుండడం అత్యంత దారుణమైన విషయం. సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే, ఈ తరహా రాజకీయాల్ని నిషేధించాల్సి వుంది.
కేంద్ర ఎన్నికల కమిషన్ తక్షణమే వైసీపీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే, కూటమి ప్రభుత్వం సైతం, వైసీపీ కార్యకర్తల హింసాత్మక ధోరణిపై ఉక్కుపాదం మోపాల్సిందే.
అన్నిటికీ మించి, ఈ ‘సెల్ఫ్ డిస్ట్రక్షన్’ రాజకీయాల్ని మానుకోవడం వైసీపీకే మంచిది. వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఈ విషయమై ఆత్మ విమర్శ చేసుకుంటారా.? చేసుకోవాల్సిందే.. లేదంటే, వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
ఎప్పుడో మూడేళ్ళ తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుందనే గుడ్డి నమ్మకంతోనే వైసీపీ కార్యకర్తలు ‘రప్పా రప్పా’ అంటే, ప్రస్తుతం అధికారంలో వున్న కూటమి కార్యకర్తలు ఇంకేమనాలి.?
తప్పు ఎవరు చేసినా తప్పే.! సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ల దగ్గర ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసినా అది నేరమే.! వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తల రక్తాభిషేకమూ నేరమే.
